Latest Updates
-
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్!
సాధారణంగా ఢోక్లా అనగానే మనకు ఫస్ట్ గుజరాత్ గుర్తుకొస్తుంది. అక్కడ ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైంలో ఎక్కువగా దీనిని తింటుంటారు. అయితే దీనిని శనగపిండి లేదా బొంబాయి రవ్వతో చేస్తుంది. కానీ ఒక్కసారి రాజస్థానీ కార్న్ ఢోక్లా( మొక్కజొన్న పిండి ఢోక్లా) రుచి చూశారంటే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మొక్కజొన్న పిండితో తయారు చేసే ఈ ఢోక్లా చాలా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఉదయాన్నే ఇది తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది, త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి, కఠినమైన డైట్ పాటించే వారికి ఇది బెస్ట్. పిల్లల లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. రాజస్థానీ కార్న్ ఢోక్లా మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మొక్కజొన్న పిండి - అర కేజీ
పచ్చి, ఎర్ర మిరపకాయలు - 2 నుండి 3
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్) - కొద్దిగా
జీలకర్ర - 1 టీస్పూన్
వాము - 1 టీస్పూన్
కారం - 2 నుండి 3 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పాపడ్ ఖార్- 2 నుండి 3 టీస్పూన్లు
వంట నూనె - 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
నీళ్లు - పిండి కలపడానికి
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో అర కిలో మొక్కజొన్న పిండిని వేయండి. ఇప్పుడు అందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి, ఎర్ర మిరపకాయలు, కొత్తిమీర, ఉల్లికాడలను వేసి బాగా కలపండి.
-ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో జీలకర్ర, వాము, కారం, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పాపడ్ ఖార్ వేయండి. ఆ తర్వాత రెండు, మూడు చెంచాల నూనెను కూడా వేసి పిండికి మసాలాలన్నీ బాగా పట్టేలా చేత్తో కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మరీ గట్టిగా కాకుండా, మెత్తగా ముద్దలా కలుపుకోండి. చేతులకు కాస్త నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రని ఢోక్లా ఆకారంలో మధ్యలో చిన్న రంధ్రం చేసి ఒత్తుకోవాలి.
-ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్ లో ఉంచి 30 నిమిషాల పాటు ఆవిరి మీద మెత్తగా ఉడికించండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే సాంప్రదాయ రాజస్థానీ మొక్కజొన్న ఢోక్లాలు రెడీ.
-ముఖ్యంగా చలికాలంలో ఈ వేడి వేడి ధోక్లాల మీద కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని చట్నీతో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
