Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బూరెల్లాంటి మంగళూరు స్పెషల్ బన్స్..మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్ట్ ఉంటది..ఎలా చేసుకోవాలంటే
మంగళూరు బన్స్ అంటే గోధుమ పిండి పూరీలే. అయితే ఇవి మామూలు పూరీలే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్లే...రుచి,రూపం,రంగులో కూడా ఇవి ప్రత్యేకంగా ఉంటాయి. బూరెల్లాగా ఉబ్బి ఉంటాయి. కమ్మగా,చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడూ తినే పూరీలను వదిలి ఓ సారి ఈ మంగళూరు బన్స్ ట్రై చేయండి. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. మంగళూరు బన్స్ ని మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మంగళూరు బన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-అరటిపండ్లు
-చక్కెర
-వంటసోడా
-గోధుమ పిండి
-జీలకర్ర
-ఆయిల్
-ఉప్పు

మంగళూరు బన్స్ తయారీ విధానం
-ముందుగా ఓ ప్లేట్ లోకి 3 మాగిన అరటిపండ్ల ముక్కలను వేసి వాటిని పప్పు గుత్తితో లేదా దేంతో అయినా మాష్ చేసుకోండి.
-తర్వాత అందులో పావు టీస్పూన్ వంట సోడా,రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసి మొత్తం కలిసేలా బాగా కలపండి.
-ఇప్పుడు అందులో 1 కప్పు గోధుమ పిండి వేసి దగ్గరగా చిక్కగా కలుపుకోవాలి. పూరీ పిండి మాదిరి ఉండాలి.
-తర్వాత అందులో పావు టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకో కప్పు పైనే గోధుమ పిండి వేసి పిండిని బాగా వత్తుకోండి.
-ఈ వత్తుకున్న పిండిపైన కొద్దిగా ఆయిల్ వేసి కనీసం 2-3 గంటలు ఊరనివ్వాలి.
Ragi Chapati: పోషకమైన రాగి చపాతీలు..చాలా మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత ఈ పిండిని నిమ్మకాయంత ముద్దలుగా తీసుకొని దానిని పూరీ కర్రతో వత్తుకోవాలి. పూరీ మాదిరి పల్చగా కాకుండా కాస్త మందంగా వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో వీటిని వేయించడారికి సరిపడా ఆయిల్ పోసి వేసి అందులో వత్తుకున్న ఈ బన్స్ ని వేయాలి. పొంగిన ఈ బన్ ని తిరగేసి నూనెను దానిమీదకు ఎగదోస్తూ ఉంటే ఎర్రగా కాలి మంచి రంగులోకి వస్తుంది. అంతే దీనిని బాండీలో నుంచి తీసివేస్తే వేడి వేడి మంగళూరు బన్స్ రెడీ.
-వీటిని మంచి స్పైసీ చట్నీ,సాంబార్ లేదా మీకు నచ్చిన సైడ్ డిష్ తో కలిపి ఆస్వాదించండి. రుచి జన్మలో మర్చిపోరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications