Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
మ్యాంగో కొబ్బరి లడ్డు..ఇలాంటి టేస్టీ స్వీట్ ఎప్పుడూ తిని ఉండరు..ఎలా చేసుకోవాలంటే
సమ్మర్ లో దొరికే మామిడికాయలను తినడానికి ఇష్టపడని వాళ్లుండరు. అయితే మామిడికాయలతో రకరకాల వంటలు, జ్యూస్ లు కూడా చేస్తుంటారు. మామిడితో చేసే అన్ని వంటకాలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. చట్నీల నుంచి సాంబార్ దాకా అనేక వంటకాలను మామిడి పండ్లతో చేస్తుంటారు. మ్యాంగో లస్సీ కూడా ఎక్కువగా చేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా మ్యాంగ్ చేసిన లడ్డూ తిన్నారా?
పండు మామడికాయలతో టేస్టీ లడ్డూలు కూడా తయారుచేస్తుంటారు. ఇతర స్వీట్లతో పోల్చితే ఈ స్వీట్ చాలా ఢిఫరెంట్ గా,ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువగా నార్త్ ఇండియాలో మ్యాంగో కొబ్బరి లడ్డుని తయారుచేస్తుంటారు. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ మ్యాంగో కొబ్బరి లడ్డూని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

మ్యాంగో కొబ్బరి లడ్డు తయారీకి కావాల్సిన
పదార్థాలు
-మామిడి పండ్ల గుజ్జు- 1 కప్పు
-యాలకల పొడి- అర టీస్పూన్
-చక్కెర- అర కప్పు
-ఢ్రై ఫ్రూట్స్
-కొబ్బరి పొడి- 2 కప్పులు
-నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
మ్యాంగో కొబ్బరి లడ్డు తయారీ విధానం
-ముందుగా పండిన మామిడిపండ్లు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలను కట్ చేసి మిక్సీలో వేసి నీళ్లు పోయకుండానే మెత్తని గుజ్జులా గ్రైండ్ చేసుకోవాలి. పీచుల్లేకుండా గుజ్జును జల్లెడలో వడకట్టి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి మీడియం మంట మీద వేడి చెయ్యండి.
-నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో తురుమిన ఎండుకొబ్బరి వేసి తక్కువ మంట మీద 2-3 నిమిషాలు వేయించండి. తురుము రంగు మారకుండా మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి.
-తర్వాత వేయించిన కొబ్బరిలో గ్రైండ్ చేసుకున్న మామిడి గుజ్జు వేసి కలపాలి. మామిడి గుజ్జులోని నీరు ఆవిరయ్యే దాకా మిశ్రమం కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఇందుకు 5-7 నిమిషాలు పడుతుంది.

-తర్వాత అందులో చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగి మిశ్రమం జిగురుగా మారడం అయ్యాక అందులో యాలకల పొడి వేసి కలపండి.
-మిశ్రమం పాన్ అంచులను వదిలి ముద్దలా అయ్యేదాకా అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండండి. దీనికి 8-10 నిమిషాలు పట్టొచ్చు. మిశ్రమం పాన్‌కి అంటుకోకుండా ఒకే ముద్దలా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
-రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చండి. పూర్తిగా చల్లారనివ్వద్దు.
-మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న భాగాలుగా తీసుకుని గుండ్రని లడ్డూలుగా చుట్టండి. కావాలనుకుంటే లడ్డూలు చుట్టేటప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు.
-చుట్టిన లడ్డూలను అదనపు తురిమిన కొబ్బరిలో దొర్లించి అన్ని వైపులా కొబ్బరి అంటుకునేలా చేయండి. అంతే టేస్టీ మ్యాంగో కొబ్బరి లడ్డు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications