Latest Updates
-
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా?
పల్లీలు, కొబ్బరి మసాలాతో..ఘుమఘుమలాడే వంకాయ ఫ్రై..జస్ట్ 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే
వంకాయ కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, పోషకాల గని కూడా. తెలుగు వారి వంటింట్లో వంకాయకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. వంకాయను ఎన్ని రకాలుగా వండుకున్నా దాని రుచి అమోఘం.
ముఖ్యంగా వేడి వేడి అన్నంలోకి, కాస్త నెయ్యి వేసుకుని, వంకాయ ఫ్రై కలుపుకుని తింటే ఆ తృప్తే వేరు. జస్ట్ 15 నిమిషాల్లో టేస్టీగా వంకాయ ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-ఎండుకొబ్బరి
-కరివేపాకు
-కారం
-పసుపు
-వెల్లుల్లి రెబ్బలు
-వంకాయలు
-ఆవాలు
-జీలకర్ర
-ఉప్పు
-నూనె
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో రెండున్నర టేబుల్ స్పూన్ల పల్లీలు(వేరుశెనగ పప్పు), 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి మీడియం మంట మీత బాగా ఫ్రై చేసుకోవాలి.
-ఎండు కొబ్బరి, పల్లీలు వేగిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన పల్లీలు,ఎండుకొబ్బరి, కరివేపాకు, 1 టీస్పూన్ కారం, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అరకేజీ వంకాయలను శుభ్రంగా కడిగి,తొడిమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాక ఇందులో వంకాయ ముక్కలు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి 1 నిమిషం మీడియం మంట మీద కలుపుతూ వేయించాలి.
-తర్వాత బాండీ మీద మూతపెట్టి వంకాయలను మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేవరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి.
-వంకాయలు మెత్తగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచిన కారం వేసి మొత్తం వంకాయ ముక్కలకు పట్టేలా 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ. దీనిని వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications