Latest Updates
-
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే!
తమలపాకు కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? దీని ముందు మిగతా చట్నీలన్నీ వేస్ట్..ఎలా చేసుకోవాలంటే
కొబ్బరితో అనేక రకాల పచ్చళ్లు తయారుచేస్తుంటారు. అయితే తమలపాకు కొబ్బరితో చేసే పచ్చడి మీరెప్పుడైనా తిన్నారా? తమలపాకు కేవలం కిల్లీకోసం వాడతారు అని చాలామంది అనుకుంటారు. అయితే తమలపాకుతో రుచికరమైన పచ్చడిని చేపుకోవచ్చు. తమలపాకు కొబ్బరితో కలిపి చేసే పచ్చడి ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు..మళ్లీ మళ్లీ చేసి పెట్టాలని ఇంట్లో వాళ్లని బతిమాలుకుంటారు. అంత బాగుంటుంది. తమలపాకు కొబ్బరిపచ్చడిని ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
తమలపాకు కొబ్బరిపచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
-ఆయిల్
-తమలపాకు
-కొబ్బరి ముక్కలు
-పల్లీలు
-అల్లం ముక్క
-పచ్చి మిరపకాయ
-ఎండుమిర్చి
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-మినపప్పు
-శెనగపప్పు

తమలపాకు కొబ్బరిపచ్చడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, కాడలు తీసేసిన 4 నాటు తమలపాకు ఆకులను తుంపి వేసి 2 నిమిషాలు వేయించి ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. వేయించడం వల్ల ఆకుల్లోని ఘాటు తగ్గుతుంది.
-తర్వాత అదే పాన్ లో 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు,చిన్న అల్లం ముక్క వేసి పచ్చిమిరపకాయపై అక్కడక్కడా నల్లగా అయ్యేవరకు ఉంచి దించేయాలి.
-తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసి అందులో 1 కప్పు కొబ్బరిముక్కలు వేసి అందులోనే కొద్దిగా నిమ్మరసం పిండి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో కొద్దిగా ఆయిల్ వేడి చేసి తర్వాత అందులో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అరటేబుల్ స్పూన్ మినపప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ ఒకదానితర్వాత మరొకటి వేసి ఎర్రగా వేయించుకోవాలి.
-తర్వాత అందులో బరకగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి తిప్పుతూ కలిపి దించేసేయండి. అంతే తమలపాకు కొబ్బరిపచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే అదిరిపోతుంది.
ఆరోగ్యకరమైనది
తమలపాకు, కొబ్బరి రెండూ కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటి కలయికతో చేసే పచ్చడి మరింత ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది. అయితే ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం మంచిది. మీకు నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉంటే మీ ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం బెటర్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications