Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
తమిళనాడు స్పెషల్ తన్నీ చట్నీ.. ఈ చట్నీతో టిఫిన్ అమోఘం!
ఉదయం ఇడ్లీ, దోశతో తినడానికి చాలా మంది చాలా రకాల చట్నీలు చేసుకొని తింటుంటారు. పల్లి చట్నీ, అల్లం చట్నీ, కారం చట్నీ ఇలా ఎన్నో రకాల చట్నీలు చేసుకొని తింటారు. అయితే ఈసారి కొత్తగా వేరే ఏదైనా చట్నీ తినాలని అనుకుంటున్నారా? అయితే తమిళనాడు స్పెషల్ తన్నీ చట్నీ ట్రై చేయండి. ఈ తన్నీ చట్నీ ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సులభం. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి.
తన్నీ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
నూనె - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 2 కట్టలు
వేరుశెనగ - 1/4 కప్పు
కొబ్బరి - 1/4 కప్పు
చింతపండు - చిన్న ముక్క
ఉప్పు - రుచి ప్రకారం
నీరు - అవసరం మేరకు
కొత్తిమీర - కొద్దిగా

మసాలా కోసం..
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1/2 tsp
మినపప్పు - 1/2 tsp
కరివేపాకు - 1 కట్ట
మిరపకాయలు - 1
ఉల్లిపాయలు - 5-6 (సన్నగా తరిగినవి)
తన్ని చట్నీ తయారీ విధానం
* ముందుగా ఓవెన్లో కడాయి పెట్టి అందులో 1 టీస్పూన్ నూనె
పోసి వేడి అయ్యాక 1/2 కప్పు శనగపిండి వేసి బాగా వేయించాలి.
* తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి.
* తర్వాత కరివేపాకు వేసి వేగిన తర్వాత అందులో శనగపప్పు, కొబ్బరి,
చింతపండు వేసి బాగా వేయించాలి.
* వేయించిన పదార్థాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి
కొంచెం ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
* తర్వాత అందులో కాస్త కొత్తిమీర చల్లి ఒకసారి గ్రైండ్
చేసుకోవాలి.
* తరవాత రుబ్బిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని, అవసరమైనంత నీళ్లు
పోసి కలపాలి.
* చివరగా ఓవెన్లో బాణలి పెట్టి మసాలాకు నూనె పోసుకోవాలి.
నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు
వేసి చట్నీలో కలుపుకుంటే రుచికరమైన తన్నీ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
