Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి కేకు..బేకరీ కేకుల్లా మెత్తగా స్పాంజీలా..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
మన అమ్మమ్మలు ఇంట్లోనే కేకులు తయారుచేసేవారని మీకు తెలుసా? అదే కొబ్బరి కేకు. కొబ్బరి కేక్ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఎటువంటి మైదా, చక్కెర లేకుండా తింటే మెదడు చురుగ్గా , ఒంటికి బలంగా తక్షణ శక్తినిచ్చి బేకరీ కేకులా దాదాపు వారం రోజులు నిల్వ ఉండే ఈ కేకు తేనె వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. కొబ్బరిలో ఉండే యాంటీమైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) ఉంటాయి.. ఇవి ఇతర కొవ్వుల కంటే సులభంగా జీర్ణం అవుతాయి, తక్షణ శక్తిని అందిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా MCTలు మేలు చేస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి..ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. కొబ్బరిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. ఆరోగ్యానికి బోలెడంత మేలు చేసే కొబ్బరితో అమ్మమ్మల కాలం నాటి కొబ్బరి కేకు మీరు కూడా మీ ఇంట్లో ఇప్పుడు సులభంగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కొబ్బరి కేకు తయారీకి కావాల్సిన పదార్ధాలు
-కొబ్బరి తురుము
-బియ్యం రవ్వ
-యాలకల పొడి
-శెనగపప్పు
-నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్
-బెల్లం
కొబ్బరి కేకు తయారీ విధానం
-ముందుగా రెండు స్పూన్ల శెనగపప్పును అరగంట సేపు నానబెట్టుకోవాలి.
-ముదురు కొబ్బరి తీసుకొని దానిని తురుముకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 గ్లాసుల మంచి నీళ్లు పోసి మరిగించి అందులో 1 గ్లాసు ఆర్గానిక్ బెల్లం, నానిన శెనగపప్పు, కొబ్బరి తురుము వేసి కలపండి.
-5 నిమిషాలు మరిగిన తర్వాత అందులో ముప్పావు గ్లాసు బియ్యం రవ్వ వేసి బాగా కలిపి కొంచెం యాలకల పొడి వేసి మాడకుండా ముద్దగా ఉడికించాలి.
-ఇప్పుడు అందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసి కలుపుకొని ప్టవ్ ఆఫ్ చేసేయాలి.
-తర్వాత కేకు మౌల్డ్ లోకి లేదా గుంట గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి మీద కొంచెం నెయ్యి వేసి ఈ గిన్నెను స్టవ్ మీద బాండీలో ఓ మూతమీద పెట్టి 40 నిమిషాల పాటు తక్కుమ మంటమీద కాలనివ్వాలి. చల్లారిన తర్వాత కేకులా కోసుకొని తినేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications