Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొబ్బరి పాలతో పులావ్.. ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది!
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మందికి నేరుగా కొబ్బరిని తినడం ఇష్టం ఉండదు. కొంత మందికి కొబ్బరి పాలను తీసి రైస్ వండుకొని తినడం ఇష్టం ఉంటుంది. అయితే ఈరోజు ఆ కొబ్బరి పాలతో రైస్ ఎలా వండుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కొబ్బరి రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
1. ముప్పావు కప్పు కొబ్బరి పాలు(సొంతగా చేసుకున్నవి అయినా లేదా
వేరే దుకాణం నుంచి తీసుకొచ్చినదైనా పర్వాలేదు)
2. ఒక కప్పు బాస్మతి బియ్యం
3. ఒక టేబుల్ స్పూన్ నూనె
4. ఒక టేబుల్ స్పూన్ బటర్
5. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ అరకప్పు
6. 2 లవంగాలు
7. ఇంచ్ దాల్చిన చెక్క
8. 2 ఇలాచీ
9. అరకప్పు సన్నగా తరిగిన క్యారెట్
10. పావుకప్పు పచ్చ బఠాణీలు
11. కొన్ని ఫ్రై చేసిన జీడిపప్పులు
12. రుచికి సరిపడా ఉప్పు
13. సన్నగా తరిగిన కొత్తిమీర

కోకోనట్ రైస్ తయారీ విధానం
ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నూనె, బటర్‌ను వేసి కొంచెం సేపు వేడి చేసుకోవాలి. ఆ నూనె, బటర్ కొంచెం వేడెక్కాక.. అందులో ఉల్లిగడ్డ, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఫ్రై చేసిన జీడిపప్పు సగం, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, పచ్చ బఠాణలు వేసి ఇంకో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
అనంతరం అందులో 15 నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతి రైస్, కొబ్బరి పాలు, మిగిలిన సగం జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు రైస్‌కి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి.. బాగా కలుపుకోవాలి. అనంతరం సన్నటి మంట మీద రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అనంతరం రైస్‌లోని స్టీమ్ బయటికి వెళ్లేంత వరకు విజిల్ పైకి ఉంచి స్టీమ్ పోయేలా ఉంచాలి. అనంతరం మూత తీసి దానిపై కొత్తిమీర వేసి, బాగా కలుపుకోవాలి.
అనంతరం సన్నగా తరిగిన కొబ్బరితో వేసి గార్నిష్ చేసుకోవాలి. అనంతరం ఒక పళ్లెంలో ఆ రైస్‌ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఘుమఘుమలాడే కొబ్బరి పాల అన్నం సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications