Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
కోయంబత్తూర్ ఫేమస్ టమోటా వాటర్ చట్నీ..వేడి వేడి ఇడ్లీలతో తింటే కేక..ఎలా చేసుకోవాలంటే
ఉదయాన్నే వేడి వేడిగా మల్లెపువ్వుల్లాంటి మెత్తని ఇడ్లీలుకి సరైన జోడీ అయిన చట్నీ లేకపోతే ఆ ఇడ్లీల రుచికి సంపూర్ణత రాదు. రోజూ చేసుకునే కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ కాకుండా కాస్త కొత్తగా, కమ్మగా, తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉండే చట్నీ కోసం చూస్తున్నారా? అయితే కోయంబత్తూర్ రోడ్ సైడ్ టమోటా వాటర్ చట్నీ ఓసారి ట్రై చేసి చూడండి. పేరులో ఉన్నట్టుగానే ఈ చట్నీ కాస్త నీళ్లగా, జారుడుగా ఉంటుంది. కానీ దాని రుచి మాత్రం మాటల్లో చెప్పలేనిది.
కోయంబత్తూర్ వీధుల్లో బండ్ల మీద అమ్మే ఈ చట్నీకి ఒక ప్రత్యేకత ఉంది. దీని ఘుమఘుమలు, దీని రుచి మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఈ చట్నీతో ఒక్కసారి ఇడ్లీ తిన్నారంటే, మీరు సాధారణంగా తినేవాటి కంటే నాలుగైదు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు. ఇది కేవలం ఇడ్లీకే కాదు, కరకరలాడే దోస, మెత్తని ఊతప్పం, వేడి వేడి వడ... దేనితో తిన్నా సరే ఆ రుచి అమోఘం. తయారీ విధానం కొంచెం విభిన్నంగా అనిపించినా, ఒక్కసారి చేసి చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. మీ ఇంట్లో వాళ్లంతా వావ్ ఏం చట్నీ చేసావ్ అని మెచ్చుకోవడం ఖాయం. టమోటా వాటర్ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బాగా పండిన టమోటాలు - అర కిలో
వంట నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 2-3
కరివేపాకు - రెండు రెమ్మలు
పసుపు - అర టీస్పూన్
కారం పొడి - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 3 టీస్పూన్లు
కొత్తిమీర - చిన్న కట్ట
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి, వాటిపై చిన్నగా గాటు పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి, ఈ టమోటాలను అందులో వేయండి. టమోటా తొక్క సులభంగా ఊడివచ్చే వరకు సుమారు 5-7 నిమిషాలు ఉడికించాలి.
-ఉడికిన టమోటాలను నీటిలో నుండి తీసి వాటి తొక్కను తొలగించండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతైన పాన్ పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కాక, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆవాలు చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు దోరగా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు బాగా వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా ప్యూరీని పాన్ లో వేయాలి. దానితో పాటు మరో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి.
-ఇప్పుడు పసుపు, కారం పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి, ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలా గరిటెతో తిప్పాలి.
-మంటను మీడియంలో ఉంచి చట్నీ నుండి పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలే వరకు సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. చట్నీ కాస్త చిక్కబడుతుంది.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి, ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఘుమఘుమలాడే, నోరూరించే కోయంబత్తూర్ రోడ్ సైడ్ టమోటా వాటర్ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications