Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సాంబార్, రసంలోకి సూపర్ సైడ్ డిష్..కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై..ఎలా చేసుకోవాలంటే
ప్రతిరోజూ ఇంట్లో ఏం వండాలి, దానికి సైడ్ డిష్ గా ఏం చేయాలి అని ఆలోచించడం గృహిణులకు ఒక పెద్ద పని. సాంబార్, రసం వంటివి చేసినా వాటిలోకి నంజుకోవడానికి ఏదైనా రుచిగా లేకపోతే భోజనం సంపూర్ణంగా అనిపించదు. అలాంటి సమయంలో ఎప్పుడూ చేసే కూరలు కాకుండా, కొంచెం కొత్తగా, ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్, గుడ్డు కాంబినేషన్ ను ఎప్పుడైనా ప్రయత్నించారా?
కాలీఫ్లవర్ మనందరికీ ఇష్టమైన కూరగాయలలో ఒకటి. దానితో చేసే ఏ వంటకమైనా ఇట్టే అయిపోతుంది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కాలీఫ్లవర్ ను గుడ్లతో కలిపి చేసే ఈ ఫ్రై రైస్, రసం, సాంబార్‌లోకి మాత్రమే కాదు, చపాతీలలోకి కూడా ఒక పర్ఫెక్ట్ సైడ్ డిష్ గా ఉంటుంది. ఇంట్లో ఉండే పదార్థాలతోనే అతి తక్కువ సమయంలో ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై తయారీకి కావాల్సిన
పదార్థాలు
-గుడ్లు: 3
-కాలీఫ్లవర్: 1
-ఉల్లిపాయ: 2
-పచ్చిమిర్చి: 2
-అల్లం: ఒక అంగుళం ముక్క
-వెల్లుల్లి: 5 రెబ్బలు
-సోంపు: అర టీస్పూన్
-కరివేపాకు: రెండు రెమ్మలు
-కారం: 1 టీస్పూన్
-మిరియాల పొడి: 1 టీస్పూన్
-పసుపు: పావు టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నూనె: 3 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం
-ముందుగా కాలీఫ్లవర్ ను చిన్న చిన్న పువ్వులుగా విడదీసి ఉప్పు వేసిన గోరువెచ్చని నీటిలో ఒక పది నిమిషాలు ఉంచండి. దీనివల్ల అందులో కంటికి కనిపించని పురుగులు ఏవైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, సోంపు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-మరోవైపు ఒక గిన్నెలో మూడు గుడ్లను పగలగొట్టి, అందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి గిలకొట్టి సిద్ధంగా ఉంచుకోవాలి.
-తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
-ఇప్పుడు గిలకొట్టిన గుడ్డు మిశ్రమాన్ని పాన్ లో పోసి, గరిటెతో కలుపుతూ ఉడికించాలి. గుడ్డు పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి.
-ఆ తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి, గుడ్డు మిశ్రమంతో బాగా కలపాలి. మూతపెట్టి చిన్న మంటపై ఐదు నుండి ఏడు నిమిషాల పాటు కాలీఫ్లవర్ మెత్తబడే వరకు ఉడికించాలి.
-కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత చివరగా మిరియాల పొడి చల్లి, మరోసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. కావాలనుకుంటే సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన, కమ్మనైన కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications