Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
జన్మజన్మలకు గుర్తుండిపోయే రుచితో పూర్ణం వంకాయ..చేసుకోవడం చాలా ఈజీ
వంకాయ పేరు వినగానే చాలామంది మొఖం చిట్లించుకుంటారు. అబ్బా ఇంకో కూర లేదా అని అంటారు. అసలు సరైన విధంగా చేయాలే గానే వంకాయతో చేసే ఏ వంటకానిక అయినా ఇంకోటి సాటి రాదు. వంకాయ వంటకం దాన్ని చేసే తీరుమీదనే ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కడికైనా పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ వంకాయ పూర్ణం వడ్డించడం చూసి ఉంటాం. వంకాయ పూర్ణం అనేది ఆంధ్ర వంటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన వంటకం. పెళ్లి భోజనంలో లేదా ప్రత్యేక సందర్భాలలో ఈ కూర తప్పనిసరిగా ఉంటుంది. వెడ్డింగ్ స్పెషల్ పూర్ణం వంకాయను ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-వంకాయలు
-జీడిపప్పు
-కారం
-ఉప్పు
-పల్లీలు
-చింతపండు
-జీలకర్ర
-కొత్తిమీర
-కరివేపాకు
-మినసపప్పు
-ధనియాలు
-పచ్చి శెనగపప్పు
-వెల్లుల్లి
-గసగసాలు
-ఆయిల్
-నువ్వులు
-ఉల్లిపాయ

తయారీ విధానం
-ముందుగా 10 నీలం రంగు పొడవాటి వంకాయలను తీసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉండేవాటిని తీసుకోండి.
-తర్వాత వంకాయలను చీరుకోవాలి. వంకాయను చివరిదాకా చీరుకోనక్కర్లదు..కాస్త అంచును వదిలేయండి.
-తర్వాత ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి కలిపి
ఇందులో
చీరుకున్న వంకాయలను వేసి 10నిమిషాలు అలా ఉంచండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో వంకాయలను వేయించడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేశాక.. వంకాయలను నీటిలో నుంచి తీసి చేత్తో గట్టిగా పిండితే నీరు అంతా పోయాక వాటిని నూనెలో వేసి 4 నిమిషాలు వదిలేయండి.
-తర్వాత నెమ్మదిగా వంకాయలను గరిటతో తిరగేస్తూ నీలం రంగు వంకాయలను లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియంలోనే ఉంచాలి.
-బాగా వేగి మెత్తబడిన తర్వాత వంకాయలను నూనెలో నుంచి తీసి ప్లేట్ లో పెట్టుకొని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఉన్న నూనెలోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి రెడ్ కలర్ లోకి వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు పూర్ణం తయారీకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు(పల్లీలు)వేసి చిట్లనివ్వాలి. తర్వాత ఇందులో 4 లవంగాలు, అంగుళంన్నర దాల్చిన చెక్క వేసి వేయించాలి.
-పల్లీలు సగంపైగా వేగాక మంటను తగ్గించి అందులో 1 టేబుల్ స్పూన్ల పచ్చి శెగనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి 2 నిమిషాలు వేయించాక ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి తక్కువ మంట మీద మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి.
-నువ్వులు వేగి చిట్లిన తర్వాత అందులో 12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ గసగసాలు వేసి 1 నిమిషం వేయించాక 1 రెబ్బ కరివేపాకు వేసి వేపండి. చివరిగా ఉల్లిపాయ తరుగు,రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లి మెత్తబడేదాకా వేయించి స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన మిశ్రమం మొత్తాన్ని వేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, చిన్న చింతపండు రెబ్బ, 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి మెత్తని పేస్ట్ ముద్దలా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసిన పేస్ట్ ముద్దలో కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి.
-తర్వాత వంకాయల్లో ఈ పేస్ట్ ను నింపి పైన జీడిపప్పు ఉంచుకోండి. అంతే టేస్టీ వంకాయ పూర్ణం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications