Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కొబ్బరి లేకుండానే అచ్చం కొబ్బరి టేస్ట్.. ఈ సీక్రెట్ చట్నీ మీకోసమే..ఎలా చేసుకోవాలంటే
ఉదయాన్నే చాలామందికి వేడివేడి ఇడ్లీ, దోశ తినాలనిపిస్తుంది. వాటిలోకి అప్పటికప్పుడు రుచికరమైన కొబ్బరి చట్నీ చేసుకుంటే ఆ మజాయే వేరు. అయితే చట్నీ చేద్దామని చూస్తే ఇంట్లో కొబ్బరి చిప్ప లేకపోయినా నిరాశ పడాల్సిన అవసరం అస్సలు లేదు. కొబ్బరి వాడకుండానే అచ్చం కొబ్బరి చట్నీ రుచి, వాసనతో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన చట్నీని తయారుచేయొచ్చు. ఈ చట్నీ తిన్నవారు, ఇందులో కొబ్బరి లేదంటే అస్సలు నమ్మరు. కొబ్బరి లేకుండానే అదిరిపోయే అదే టేస్ట్ ఉండే చట్నీని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 4
పెద్ద ఉల్లిపాయ - 1
వేయించిన శనగపప్పు -పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 2
చింతపండు - చిన్న నిమ్మకాయంత
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - అవసరమైనంత
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
ఎండుమిర్చి - 1
ఇంగువ - చిటికెడు
సాంబార్ ఉల్లిపాయలు- 5
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
-ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మెత్తబడి, పచ్చివాసన పోయేవరకు వేయించి, స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లార్చిన ఉల్లిపాయ-పచ్చిమిర్చి మిశ్రమం, వేయించిన శనగ పప్పు(పుట్నాల పప్పు), వెల్లుల్లి, చింతపండు,రుచికి సరిపడా ఉప్పు వేయండి.
-మొదట నీళ్లు పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసి, ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీకు కావాల్సినంత పల్చగా నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు పోపు కోసం అదే బాండీలో ఒక స్పూన్ నూనె వేసి వేడిచేయండి. ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఘుమఘుమలాడుతున్న ఈ పోపును నేరుగా చట్నీలో కలిపేయండి. అంతే నోరూరించే, కొబ్బరి లేని కొబ్బరి చట్నీ రెడీ. దీనిని ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం వంటి ఎటువంటి అల్పాహారంతోనైనా ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









