Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కొబ్బరి చట్నీ బోర్ కొట్టిందా? ఈసారి ఇలా చేసి చూడండి, ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే
పొద్దున్నే మన తెలుగు వారి ఇళ్లల్లో ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోశ లేదా బోండా వంటివి చేస్తుంటారు. వీటికి కాంబినేషన్ గా ఎక్కువమంది కోకోనట్ చట్నీని తయారుచేస్తుంటారు. ప్పుడూ చేసే సాధారణ కొబ్బరి చట్నీతో విసుగొచ్చిందా? కొన్నిసార్లు కొబ్బరిలో రుచి తక్కువగా ఉండి, చట్నీ చప్పగా అనిపిస్తుందా? అయితే ఈసారి కొబ్బరి చట్నీ చేసేటప్పుడు కేవలం రెండు పదార్థాలు అదనంగా చేరిస్తే చాలు, మీ మామూలు చట్నీ అద్భుతమైన రుచితో, ఘుమఘుమలాడుతూ, కంటికింపుగా పచ్చని రంగులో తయారవుతుంది.
ఆ రహస్య పదార్థాలే కొత్తిమీర, కరివేపాకు. వి పోషకాలను అందించడమే కాకుండా, మీ చట్నీకి సరికొత్త జీవం పోస్తాయి. ఈ చట్నీ రుచి చూశాక, మీ ఇంట్లో వాళ్ళు ఒకటి తినేచోట నాలుగు తింటారు. చట్నీని అంచులకు ముట్టుకుని తినరు.. ఇడ్లీలపైన, దోసెలపైన ధారాళంగా పోసుకుని, నానబెట్టుకుని మరీ ఆస్వాదిస్తారు. మరి అంత రుచికరమైన ఈ పచ్చ కొబ్బరి చట్నీని ఎలా తయారుచేసుకోవాలొ ఇక్కడ చూడండి.

-పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
-వేయించిన వేరుశనగ - 1/2 కప్పు
-పచ్చిమిర్చి - 3
-సాంబార్ ఉల్లిపాయలు - 3
-వెల్లుల్లి రెబ్బలు - 2
-కొత్తిమీర - ఒక చిన్న కట్ట
-కరివేపాకు - కొన్ని రెబ్బలు
-చింతపండు - చిన్న ముక్క
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - అవసరమైనంత
-నూనె - 2 టీస్పూన్లు
-ఆవాలు - 1/2 టీస్పూన్
-మినపప్పు - 1 టీస్పూన్
-కరివేపాకు - ఒక రెబ్బ
-ఎండుమిర్చి - 1
గ్రీన్ కోకోనట్ చట్నీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో కొబ్బరి తురుము, వేరుశనగ,
పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, శుభ్రం చేసుకున్న
కొత్తిమీర, కరివేపాకు, చిన్న చింతపండు ముక్క, రుచికి సరిపడా ఉప్పు
జోడించండి.
-కొద్దిగా నీళ్ళు పోసి అన్నింటినీ కలిపి మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి.
=ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని మీకు కావలసినంత పలుచగా చేయడానికి మరికొన్ని నీళ్ళు కలపండి.
-చివరగా తాళింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
-ఇప్పుడు వేగిన ఈ తాళింపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో కలిపితే, కమ్మనైన, రుచికరమైన పచ్చ కొబ్బరి చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications