Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పచ్చిమిర్చితో రుచికరమైన హల్వా..ఎలా తయారుచేసుకోవాలో చూడండి
స్వీట్స్ అనగానే మనలో చాలామందికి ఫస్ట్ గుర్తుకొచ్చేది జిలేబీ, గులాబ్ జామ్, లడ్డూ, మైసూర్ పాక్, హల్వా. అయితే ఆశ్చర్యపరిచే ఒక కొత్త రుచి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే మిర్చి హల్వా. మిర్చి హల్వా పేరు ఎప్పుడూ వినలేదే ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? కూరల్లో ఘాటుకు, పచ్చళ్లలో కారానికి చిరునామాగా నిలిచే పచ్చిమిర్చితో హల్వా కూడా తయారుచేయవచ్చు. మిరపకాయలోని ఘాటును మాయం చేసి, దానిలో దాగి ఉన్న ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను బయటకు తీసి, దానికి తియ్యదనాన్ని జోడిస్తే వచ్చే అద్భుతమే ఈ మిర్చి హల్వా.
మిర్చి హల్వా రుచి మాటల్లో వర్ణించలేనిది. నోట్లో పెట్టగానే ఒకరకమైన వింత అనుభూతి ఉంటేంది. నెయ్యి, కోవా, పాలపొడిల కలయికతో వచ్చే మధురమైన రుచి మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. మీ ఇంట్లో వాళ్లకు గానీ, స్నేహితులకు గానీ పేరు చెప్పకుండా ఈ హల్వాను రుచి చూపిస్తే ఇది మిర్చితో చేశారని ఎవరూ ఊహించలేరు. అంత ప్రత్యేకంగా ఉంటుంది. సూపర్ టేస్టీ మిర్చి హల్వాను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మిర్చి హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి మిరపకాయలు - 20
-చక్కెర - పావు కిలో
-కలకండ- ఒక అంగుళం ముక్క
-మిల్క్ పౌడర్ - 4 టేబుల్ స్పూన్లు
-శుభ్రమైన నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు
-కోవా - ఒక కప్పు
-పిస్తా, బాదం పలుకులు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి, అందులో ఒక కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు వేడెక్కుతున్నప్పుడు అందులో కలకండ ముక్క వేయాలి.
-నీళ్లు బాగా మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అందులో వేయాలి. మిరపకాయలు మెత్తబడి, వాటి రంగు కొద్దిగా పసుపు వర్ణంలోకి మారేంత వరకు ఉడికించాలి. ఈ ప్రక్రియ మిరపకాయలలోని ఘాటును పూర్తిగా తొలగిస్తుంది.
-ఉడికిన మిరపకాయలను నీటిలో నుంచి తీసి, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి, నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక, సిద్ధం చేసి పెట్టుకున్న మిరపకాయల పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. నెయ్యి మిశ్రమం నుంచి విడిపోయి పైకి తేలుతున్నప్పుడు, తురిమిన కోవా వేసి బాగా కలపాలి.
-కోవా పూర్తిగా కలిసిపోయాక, చక్కెర వేయాలి. చక్కెర కరిగి, మిశ్రమం కాస్త పలుచగా అవుతుంది. చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి. మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు, పాలపొడి వేసి ఉండలు లేకుండా వేగంగా కలపాలి.
-హల్వా మిశ్రమం పాన్ కు అంటుకోకుండా ముద్దలా దగ్గరపడే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆపివేసి హల్వాను ఒక గిన్నెలోకి తీసుకుని పైన సన్నగా తరిగిన పిస్తా, బాదం పలుకులతో అలంకరించుకోవాలి. అంతే పచ్చిమిర్చి హల్వా రెడీ.
-వేడివేడిగా తిన్నా, చల్లారాక తిన్నా దీని రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications