ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!

Posted By:

ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి రొటీన్ బ్రేక్ ఫాస్ట్ లతో మీరు బాగా విసిగిపోయారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన, నోరూరించే ప్రత్యామ్నాయం ఉంది. అదే ఎగ్ పరాఠా. ఉదయం పూట శక్తివంతమైన, పోషకాలతో కూడిన ఆహారంతో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటాం.

ఈ ఎగ్ పరాఠా కేవలం రుచిని మాత్రమే కాదు, మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ను కూడా పుష్కలంగా అందిస్తుంది. దీని తయారీ విధానం చాలా సులభం. ఇది తింటే కడుపు నిండుగా అనిపించడమే కాకుండా మధ్యాహ్నం వరకు మీకు ఆకలి వేయకుండా చేస్తుంది. ఆఫీసుకు వెళ్లేవారికి, స్కూల్‌కి వెళ్లే పిల్లల బాక్స్‌లోకి ఇది పర్ఫెక్ట్.

The Ultimate Breakfast Recipe Make Quick Tasty and Protein Rich Egg Paratha in telugu

ఎగ్ పరాఠా తయారీకి కావాల్సిన పదార్థాలు

పిండి తయారీ కోసం:
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
నీళ్లు - తగినన్ని

లోపలి స్టఫింగ్ (మిశ్రమం) కోసం
గుడ్లు - 3
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర తురుము - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
కారం పొడి - అర టీస్పూన్
గరం మసాలా - పావ టీస్పూన్
చాట్ మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
వంట కోసం - నెయ్యి లేదా నూనె

చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి

ఎగ్ పరాఠా తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి వేయండి. దానికి కాస్త ఉప్పు, ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి జతచేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని ఎంతో మృదువైన ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై ఒక మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. అప్పుడే పరాటాలు ఎంతో సాఫ్ట్‌ గా వస్తాయి.

-వేరొక గిన్నె తీసుకుని అందులో మూడు గుడ్లను పగలగొట్టి వేయండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేయండి. అలాగే కారం, గరం మసాలా, చాట్ మసాలా, మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి, ఒక ఫోర్క్ లేదా విస్కర్ తో మసాలాలు అంతా కలిసేలా బాగా గిలకొట్టండి.

-ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుతూ, ఒక్కో ఉండను గుండ్రని రొట్టెలాగా పలుచగా ఒత్తుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేయండి. దానిపై ఒత్తుకున్న రొట్టెను వేసి రెండు వైపులా సగం ఉడికేలా కాల్చుకోండి.

-లైట్‌ గా కాలిన రొట్టెను పెనం మీదే ఉంచి, దాని పైన మనం ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని పోసి పరాఠా అంతటా సమానంగా పరచండి. అంచుల వెంబడి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేస్తూ మంటను సిమ్‌ లో ఉంచి ఉడికించండి.

-రెండు వైపులా మంచి బంగారు రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చే వరకు, పైన కాస్త కరకరలాడేలా కాల్చుకోవాలి. అంతే ప్రొటీన్ రిచ్ ఎగ్ పరాఠా రెడీ. దీన్ని పుదీనా గ్రీన్ చట్నీ, టొమాటో కెచప్, పెరుగు లేదా మీకు ఇష్టమైన పచ్చడితో తినండి.

[ of 5 - Users]
Story first published: Thursday, September 3, 2026, 9:44 [IST]
Desktop Bottom Promotion