Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఒక్కసారి ఈ పచ్చడి తింటే ఇంకే పచ్చడీ నచ్చదు.. ఇడ్లీ, దోశెలలోకి కేక..ఎలా చేసుకోవాలంటే
రోజూ తినే ఇడ్లీ, దోశెలలోకి అవే రొటీన్ కొబ్బరి, పల్లీ పచ్చళ్లు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి కాస్త భిన్నంగా, కారంగా, పుల్లగా, ఎంతో రుచికరంగా ఉండే వెల్లుల్లి చింతపండు పచ్చడిని ట్రై చేయండి. దీని ఘాటైన రుచి, అద్భుతమైన సువాసన మీ బ్రేక్ ఫాస్ట్ ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తయారు చేయడం చాలా సులభం, కానీ రుచి మాత్రం అమోఘం. వంట రాని వాళ్లు కూడా దీనిని చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఈ పచ్చడి వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. నోరూరించే వెల్లుల్లి చింతపండు పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి రెబ్బలు - 15
-సాంబార్ ఉల్లిపాయలు చిన్నవి - 7
-ఎండు మిరపకాయలు - 7 (మీ కారానికి తగినట్లు)
-చింతపండు - పెద్ద నిమ్మకాయంత
-కరివేపాకు - రెండు రెమ్మలు
-నువ్వుల నూనె - 4 టీస్పూన్లు
-కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
-పసుపు - చిటికెడు
-ఇంగువ - పావు టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
తాళింపు కోసం:
-నువ్వుల నూనె - 1 టీస్పూన్
-ఆవాలు - అర టీస్పూన్
-మినపప్పు - 1 టీస్పూన్
-కరివేపాకు - ఒక రెమ్మ

తయారీ విధానం
-ముందుగా ఓ బాండీని స్టవ్ మీద పెట్టి 3 టీస్పూన్ల నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు ఎండు మిరపకాయలు, చింతపండు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు మెత్తబడే వరకు పచ్చివాసన పోయి, మంచి సువాసన వచ్చేంత వరకు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
-ఇప్పుడు కాశ్మీరీ కారం పొడి, ఇంగువ వేసి మరో నిమిషం పాటు వేయించి పచ్చి వాసన పోయాక స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని, చిటికెడు పసుపు, మిగిలిన 2 టీస్పూన్ల నువ్వుల నూనె కూడా వేయాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగా, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇక చివరిగా తాళింపుతో ఈ పచ్చడికి మరింత రుచిని తీసుకోండి. అదే బాండీలో టీస్పూన్ నూనె వేసి ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి, ఈ తాళింపును రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో కలపాలి. అంతే నోరూరించే ఘుమఘుమలాడే వెల్లుల్లి చింతపండు పచ్చడి సిద్ధం. వేడివేడి ఇడ్లీ, దోశె, లేదా ఊతప్పంతో తింటే ఆహా, ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
