Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
మన పూర్వీకుల ఆరోగ్యకరమైన అలవాట్లలో రొట్టెలు ముందుంటాయి. అందులో సజ్జ రొట్టె ప్రధానమైనది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, ప్రొటీన్, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ బాధితులకు, బరువు నియంత్రణకు, ఎముకల బలానికి ఈ రొట్టెలు తినాలని డాక్టర్లు సైతం సిఫారసు చేస్తారు. అయితే ఈ రొట్టెలు చేయడం రాక చాలా మంది వీటిని బయట కొనుగోలు చేస్తారు. లేదంటే చపాతీలు తింటారు. కానీ ఈ 3 చిట్కాలు పాటించినట్లయితే సజ్జ రొట్టెలను చాలా సింపుల్‌గా, ఆరోగ్యకరంగా, చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి.. ఈ రొట్టెలను ఎలా చేసుకోవాలో చూద్దాం..

సజ్జ రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
సజ్జ పిండి- కప్పు లేదా పావు కేజీ
ఉప్పు- కొద్దిగా
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
వేడి నీళ్లు- పిండి కలుపుకోవడానికి సరిపడా
నెయ్యి- రొట్టెలు కాల్చడానికి సరిపడా
సజ్జ రొట్టె తయారీ విధానం
ముందుగా సజ్జ పిండిని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో పావు టీస్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మొత్తం కలిసే కలుపుకోవాలి.
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఇప్పుడు మరిగించిన నీళ్లను తీసుకుని పిండిలో కొద్దికొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా సాఫ్ట్‌గా అయ్యేవరకు కలుపుకోవాలి.
పిండి మొత్తం తడిపిన తర్వాత చపాతీ పిండి ముద్దల మాదిరిగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
పీటపైన కొద్దిగా పొడి పిండి వేసి చపాతీ కర్రతో పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఈ పిండికి సాగే గుణం తక్కువగా ఉంటుంది కాబట్టి గుండ్రంగా రావు. అందుకే గుండ్రని ఆకృతి కోసం మీకు కావాల్సిన సైజ్ బౌల్‌తో గుండ్రంగా ఒత్తుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పెనం పెట్టుకుని కాలిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న సజ్జ రొట్టెను వేసుకుని కాల్చుకోవాలి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. తర్వాత రెండు వైపులా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ పొంగు వచ్చేలా కాల్చుకోవాలి.
ఇలా అన్ని ముద్దలను చేసుకుని రొట్టెలను ఇదే మాదిరిగా కాల్చుకోవాలి. రొట్టెలు పొంగుతూ వచ్చినట్లయితే చపాతీల మాదిరిగా సాఫ్ట్‌గా, మెత్తగా ఉంటాయి. అంతే చపాతీలు చేసినంత ఈజీగా రొట్టెలను ఈ పద్ధతిలో ఈజీగా చేయవచ్చు.
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
నూనె, వేడి నీళ్లు, నెయ్యి ఈ మూడింటిని కరెక్ట్‌గా వాడుతూ ఆరోగ్యకరమైన సజ్జ రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రొట్టెలను డిన్నర్లో తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా అవుతుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
షుగర్‌తో బాధపడేవారికి, అధిక బరువు సమస్య ఉన్నవారికి సజ్జ రొట్టెలు మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. రక్తహీనత సమస్యను సైతం నివారిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications