Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఘుమఘుమలాడే టమోటా రైతా..రుచిలో అమోఘం,ఆరోగ్యానికి అద్భుతం..ఎలా చేసుకోవాలంటే
మనలో చాలా మందికి భోజనం అంటే కేవలం అన్నం, కూర మాత్రమే కాదు. దానికి తోడుగా ఓ కమ్మని చారు, పప్పు లేదా రసం ఉండాల్సిందే. కొన్నిసార్లు సాంబారు, పచ్చడి వంటివి లేకపోయినా సర్దుకుపోతాం కానీ భోజనంలోకి జారుగా ఏదైనా లేకపోతే ఓ వెలితిగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మన నాలుకకు కొత్త రుచిని పరిచయం చేసేదే టమాటా తంబూలి. టమాటా తంబూలిని కర్ణాటకలో ఎక్కువగా తయారుచేస్తుంటారు.
దీనిని టమాటా రైతాగా కూడా పిలుస్తారు. ఇది కేవలం రుచికరమైన వంటకమే కాదు శరీరానికి చల్లదనాన్ని, మనసుకు హాయిని ఇచ్చే అద్భుతమైన ఔషధం కూడా. దీని రుచి అమోఘం. వేడి వేడి అన్నంలో ఈ తంబూలిని కలుపుకుని తింటే ఆ అనుభూతే వేరు. ఇది అన్నంతోనే కాదు, దోసె, ఇడ్లీలతో కూడా చాలా బాగుంటుంది. నోరూరించే కర్ణాటక స్టైల్ టమోటా తంబూలిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పండిన టమోటాలు - 2
పచ్చి మిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - ఒక రెబ్బ
పెరుగు - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
మిరప పొడి - చిటికెడు
నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
ఎండు మిర్చి - 1
ఇంగువ - చిటికెడు
తయారుచేసే విధానం
-ముందుగా ఓ బాండీని స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి.
-నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి.
-ఇప్పుడు అందులో కొత్తిమీర, కరివేపాకు, చిటికెడు మిరప పొడి వేసి ఒక్క నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన టమోటా మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా చిలికి, పలుచని మజ్జిగలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగలో మనం సిద్ధం చేసుకున్న టమోటా పేస్ట్ ను వేసి బాగా కలపాలి.
-తర్వాత పోపు కోసం అదే బాండీలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత తరిగిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేయించి, ఈ పోపును నేరుగా తంబూలిలో కలపాలి. అంతే ఘుమఘుమలాడే, రుచికరమైన టమోటా తంబూలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications