Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Tomato roti pachadi: టమాటో రోటి పచ్చడి..ఇలా చేసి వేడి అన్నంలో లేదా దోశెతో తింటే స్వర్గమే
ఇప్పుడంతా మిక్సీలు వచ్చేశాయి కానీ పాత రోజుల్లో ఏ పచ్చడి చేయాలన్న రోట్లోనే. మిక్సీలో వేసిన దాని టేస్ట్ కన్నా రోట్లో చేసినవే టేస్టీగా ఉంటాయి. ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు కూడా తాము కూడా రోటి పచ్చళ్ల ఫ్యాన్స్ అని చెప్తుండటం వీడియోలలో చూస్తున్నాం. రోట్లో రుబ్బిన పచ్చడికి మిక్సీలో వేసి చేసిన పచ్చడికి టేస్ట్ లో చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే రోటీ పచ్చళ్లు తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇడ్లీ,దోశ,అన్నం ఇలా దేంట్లోకైనా టేస్టీగా ఉండే రోటి పచ్చళ్లలో టమాటో పచ్చడి ఒకటి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటుంటే స్వర్గమే. అయితే టమాటో రోటి పచ్చడిని చేయడం చాలా ఈజీ. 300 గ్రాముల టమాటోలతో రోటి పచ్చడి తయారీకి ఏమేం పదార్థాలు కావాలి..తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

టమాటో రోటీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆయిల్- 1 లేదా 2 టేబుల్ స్పూన్స్
-వేరుశెనగ గుళ్లు- 1 టేబుల్ స్పూన్
-పచ్చి మిర్చి- 10-15
-టమాటోలు- 300 గ్రాములు
-చింతపండు- కొంచెం
-కల్లు ఉప్పు- రుచికి తగినంత
-వెల్లుల్లి రెబ్బలు- 2 లేదా 3
-కరివేపాకు-2 రెమ్మలు
-కొత్తమీర(సన్నగా కట్ చేసిన) 2-3టేబుల్ స్పూన్స్
టమాటో రోటి పచ్చడి తయారీ విధానం
-స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ ల ఆయిల్ పోయాలి.
-ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి దోరగా ఫ్రై చేయండి.
-పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులో 10-15 పచ్చి మిర్చి కట్ చేయకుండా వేసి ఫ్రై చేసుకోండి.
-పచ్చి మిర్చి కొంచెం మగ్గిన తర్వాత 300 గ్రాముల టమాటోలు పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసి వేయండి.
-అన్నింటిని బాగా కలిపి మూత పెట్టి మంటను లో నుంచి మీడియం ఫ్లేమ్ లో అడ్జెస్ట్ చేసి ఐదు నుంచి పది నిమిషాలు టమాటోలు మగ్గే వరకు ఉడికించాలి.
-టామాటోలు పూర్తిగా డ్రై అయిపోకూడదు..వాటిలో గుజ్జు ఉండాలి.
-టమాటోలు మగ్గిన తర్వాత అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు,కొద్దిగా కల్లు ఉప్పు వేసి స్టవ్ ఆపేయండి.
-వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని ఓ బౌల్ లోకి తీసి చల్లారేవరకు పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు రెండు రెమ్మలు వేయండి. ఇందులో ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చిలో నుంచి ఓన్లీ పచ్చిమిర్చిని తీసుకోని రోట్లో దంచుకోండి.
-దీనిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత(మిక్సీలో అయినా సరే) మగ్గించిన టమాటోలను వేసి కచ్చాపచ్చాగా దుంచుకోండి.
-చివరిగా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ల కొత్తిమీర అందులో వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే టమాటో రోటి పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications