Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్టవ్ మీద గిన్నె పెట్టే పనిలేదు..సీతాఫలంతో ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు లాగించేస్తారు!
సీతాఫలం కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండిన పోషకాల గని సీతాఫలం.ఇలాంటి సీతాఫలంని కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. అలాంటివారికి సీతాఫలంలో ఐస్ క్రీమ్ చేసి పెడితే గిన్నెలు గిన్నెలు లాగించేస్తారు. సీతాఫలం సహజమైన తీపి,ప్రత్యేకమైన సువాసన ఐస్ క్రీమ్ కు కొత్త రుచిని ఇస్తారు. మీ ఇంట్లోనే చాలా ఈజీగా సీతాఫలం ఐస్ క్రీం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-సీతాఫలం కాయలు
-షుగర్ పౌడర్
-పాలమీగడ లేదా ఫ్రెష్ క్రీమ్
-వెన్నిలా ఎసెన్స్
-మిల్క్ పౌడర్

తయారీ విధానం
-ముందుగా బాగా పండిన 4 సీతాఫలాలను తీసుకొని వాటిని సగానికి కట్ చేసి గుజ్జును ఓ గిన్నెలో వేసుకోండి.
-ఇప్పుడు ఆ గుజ్జు నుంచి గింజలను తీసేయాలి, దీనికోసం చేత్లో లేదా పెద్ద చిల్లులున్న జల్లెడను ఉపయోగించవచ్చు.
-తర్వాత అరకప్పు గుజ్జను సపరేట్ గా తీసి ఓ గిన్నెలోకి పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు 1 కప్పు గుజ్జును మిక్సీ గిన్నెలో 1 కప్పు సీతాఫలం పల్ప్, 1/3 కప్పు షుగర్ పౌడర్, 1/3 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు పాలమీద మీగడ లేదా ప్రెష్ క్రీమ్ అయినా, 1 టీస్పూన్ వెన్నిలా ఎసెన్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
-తర్వాత ఓ గిన్నెలో లేదా బాక్సులో గ్రైండ్ చేసిన మిశ్రమం వేసి మూతపెట్టి ఫ్రిడ్జ్ లో 2-3 గంటలు ఉంచేయాలి.
-తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసి మళ్లీ మిక్సీ జార్ లో వేసి మరోసారి బ్లెండ్ చేసుకోండి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ ట్రే లేదా గిన్నెలో వేసి అందులో సపరేట్ గిన్నెలో పక్కన పెట్టుకున్న సీతాఫలం గుజ్జును ఇందులో వేసి లైట్ గా స్పూన్ తో కలిపి దానిమీద ఏదైనా కవర్ పెట్టి దీనిమీద మూతపెట్టేసి ఫ్రిడ్జ్ లో రాత్రంతా లేదా 8 గంటలు అయినా ఉంచుకోవాలి.
-తర్వాత మూత తీస్తే టేస్టీ సీతాఫలం ఐస్ క్రీం రెడీ. ఇది కనీసం వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications