Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఒకప్పుడు బడుల ముందు అమ్మే బెల్లం బోండాలు..రుచిలో దీన్ని మించిన స్నాక్ లేదు..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడంటే డెజర్ట్స్,కేకులు,ఐస్ క్రీమ్ లు వచ్చి ఫ్యాన్సీ ఫుడ్ మీద మోజు ఎక్కువైంది కానీ ఒకప్పుడు మన స్నాక్స్,డెజర్ట్స్ అన్నీ బెల్లం బోండాలే. కొన్నేళ్ల క్రితం వరకు స్కూల్స్ ముందు కూడా ఈ బెల్లం బోండాలు అమ్ముతుండేవాళ్లు. వీటిని వేడివేడిగా తింటే ఒక రుచి..చల్లారక తింటే మరో ఉంటుంది. బెల్లం బోండాలను తయారుచేసుకోవడం చాలా చాలా ఈజీ. క్షణాల్లోనే దీనిని తయారుచేసుకొని ఆస్వాదించచ్చు. మీ ఇంట్లోనే సింపుల్ గా బెల్లం బోండాలను తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బెల్లం బోండాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెల్లం తరుము
-పెరుగు
-వంటసోడా
-బొంబాయి రవ్వ
-గోధుమ పిండి
-ఉప్పు
-సోంపు
-ఆయిల్
-నీళ్లు

బెల్లం బోండాలు తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో 200 గ్రాముల బెల్లం తరుము వేయండి. ఇందులోనే పావుకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి.
-బెల్లం కరిగిన తర్వాత గిన్నెను పక్కకుపెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఓ బౌల్ లో పావు కప్పు పెరుగు, 1 టీస్పూన్ వంటసోడా వేసి కలిపాక ఇందులో 2 టీస్పూన్ల బొంబాయి రవ్వ వేసి 5 నిమిషాలు వదిలేయండి. అప్పుడు సోడాతో కలిసిన పెరుగు పొంగుతుంది.
సమ్మర్ స్పెషల్ లడ్డు.. శరీర వేడిని తగ్గించి ఒంటికి చలువ..ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు అందులో పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని వడకట్టి పోయాలి. తర్వాత ఇందులోనే 400 గ్రాముల గోధుమపిండి, 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ సోంపు వేసి కలపండి. ఉండలు లేకుండా కలుపుతూ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా మొత్తం అరకప్పు నీళ్లు పోసుకొని కలపాలి. చేత్తోనే కొద్దిసేపు పిండిని బీట్ చేయాలి.
-కలుపుకున్న పిండిమీద మూతపెట్టి కనీసం అరగంట సేపు పక్కనపెట్టండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని బోండాలుగా ఇందులో వేయాలి. బాగా కాల్చుకొని దించసుకోవాలి.
-వీటిని వేడి వేడిగా తింటే ఒకరకమైన టేస్ట్..చల్లారిన తర్వాత తింటే మరో టేస్ట్ ఉంటుంది. ఇవి 3 రోజులు దాకా పాడవకుండా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications