Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సమ్మర్ స్పెషల్ లడ్డు.. శరీర వేడిని తగ్గించి ఒంటికి చలువ..ఎలా చేసుకోవాలంటే..
సమ్మర్ లో శరీరానికి చల్లదానాన్ని ఇచ్చే పదార్థాలు తినాలని డాక్టర్లు,నిపుణులు సూచిస్తుంటారు. ఈ క్రమంలో పుచ్చకాయలు, కొబ్బరినీళ్లు సహా శరీర వేడిని తగ్గించి ఒంటికి చలువచేసే అనేక రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. అయితే సమ్మర్ లో ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకునే ఓ లడ్డూ తింటే శరీర వేడి మొత్తం దిగిపోయి ఒంటికి చలువ చేస్తుంది. పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. బార్లీ,అవిసె గింజలతో ఈ లడ్డూ తయారుచేస్తారు. సమ్మర్ స్పెషల్ లడ్డూని ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సమ్మర్ స్పెషల్ బార్లీ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బార్లీ గింజలు
-అవిసె గింజలు
-నెయ్యి
-బాదంపప్పు
-జీడిపప్పు
-పల్లీలు
-ఏలకులు
-బెల్లం
సమ్మర్ స్పెషల్ బార్లీ లడ్డూ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు బార్లీ గింజలు వేసి తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత వాటిని పక్కనపెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో 1కప్పు పల్లీలు వేసి వేయించి వీటిని కూడా పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో పావు కప్పు అవిసె గింజలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. వీటిని వేయించిన పల్లీలలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి ఇందులో 15-20 బాదంపప్పులను ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. బాదంపప్పు ముక్కలు సగం వరకు వేగాక ఇందులో 20 జీడిపప్పు ముక్కలు కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకొని వీటిని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
శరీరానికి పుష్టినిచ్చే రాగి లడ్డు..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే
-వేయించిన బార్లీ గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే 4 ఏలకులు వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులోనే వేయించిన పల్లీలు,అవిసె గింజలు కూడా వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఓ గిన్నెలో లేదా పాన్ లో వేసి ఇందులోనే ముప్పావు కప్పు బెల్లం తరుము వేసి బాగా కలిపి ఈ పొడిని మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన పొడిని ఓ గిన్నెలో వేసి ఇందులోనే వేయించిన జీడిపప్పు,బాదం ముక్కలు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలా మీకు నచ్చిన సైజులో చేసుకోండి. అంతే సమ్మర్ స్ఫెషల్ బార్లీ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







