Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
క్యాబేజీని ఇష్టపడని వారికి కూడా నచ్చే పచ్చడి రెసిపి..అన్నం,ఇడ్లీ దేనిలోనైనా సూపర్ కాంబినేషన్
మనలో చాలామంది క్యాబేజీ అనగానే ముఖం తిప్పేసుకుంటారు. క్యాబేజీని చాలామంది అంతగా ఇష్టపడరు. కానీ ఈ సామాన్యమైన కూరగాయతో చేసే పచ్చడి మాత్రం అద్భుతమైన రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్యాబేజీ పచ్చడి సాధారణంగా క్యాబేజీని ఇష్టపడని వారికి కూడా నచ్చుతుంది. దీని రుచి, పోషక విలువలు మీ రోజువారీ ఆహారంలో క్యాబేజీని చేర్చడానికి ఒక అద్భుతమైన మార్గం. క్యాబేజీ పచ్చడిని వేడి వేడి అన్నంలో, ఇడ్లీలో, దోసెలో ఇలా దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు దీని తయారీ చాలా సులభం. మీ ఇంట్లోనే అదిరిపోయే టేస్ట్ తో క్యాబేజీ పచ్చడిని తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
క్యాబేజీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-క్యాబేజీ
-కరివేపాకు
-ఇంగువ
-ఆవాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-చింతపండు
-టమాటో
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-ఆయిల్
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు

క్యాబేజీ పచ్చడి తయారీ విధానం
-ముందుగా అరకేజీ క్యాబేజీని సన్నని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. 50 గ్రాముల పచ్చిమిరపకాయలు, 4 టమాటోలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 4 టీస్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 50 గ్రాముల పచ్చిమిరపకాయలు,నిమ్మకాయ సైజు అంత చింతపండు, 4 టమాటోల పెద్ద ముక్కలు, క్యాబేజీ ముక్కలు వేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి తక్కువమంట మీద పావు గంట సేపు ఉడకించుకోవాలి.
-తర్వాత మూత తీసి క్యాబేజీ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్లీ మూతపెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి మగ్గిన క్యాబేజీని చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో క్యాబేజీ మిశ్రమం మొత్తం వేసి ఇందులోనే పావు టీస్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నీరు అస్సలు పోయకూడదు.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టీస్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో పావు టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్, అర టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ పచ్చిశెనగపప్పు, 7 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి తక్కువమంట మీద తాళింపుని వేయించుకోవాలి. తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించాలి. చివరిగా ఇందులో కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ తాళింపులో గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. అంతే క్యాబేజీ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications