Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఉగాది స్పెషల్ అప్పాల పాయసం..ఇలాంటి టేస్ట్ ఇంతకుముందు తిని ఉండరు,ఎలా చేయాలంటే
తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాదిని ఈ ఏడాది మార్చి 30వ తేదీన జరుపుకుంటారు. ఉగాది పండుగ తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచనగా వస్తుంది. ఈ పండుగను తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడితో పాటు తీపి వంటకంగా అప్పాల పాయసం తప్పనిసరిగా చేస్తారు. ఉగాది రోజున ప్రత్యేకంగా తయారుచేసే వంటకాల్లో అప్పాల పాయసం రుచికరమైనది మాత్రమే కాదు..సంప్రదాయంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
బియ్యం పిండితో చేసిన అప్పాలు, పాలు, బెల్లం లేదా చక్కెరతో ఈ పాయసం తయారు చేస్తారు. దీనిలో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. నోరూరించే అప్పాల పాయసం ఇంట్లోనే ఈజీగా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

అప్పాల పాయసం తయారీకి కావలసిన పదార్థాలు
-పాలు - 1 లీటరు
-బెల్లం తురుము లేదా చక్కెర - 1 కప్పు
-జీడిపప్పు - 10-12
-ఎండుద్రాక్ష - 1 టేబుల్ స్పూన్
-బియ్యం పిండి - 1 కప్పు
-నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
-యాలకుల పొడి - 1/2 టీ స్పూన్
-పచ్చ కర్పూరం - చిటికెడు
-కుంకుమ పువ్వు - కొద్దిగా
Ugadi pachadi: శాస్త్రీయమైన పద్దతిలో..నిజమైన ఉగాది పచ్చడిని ఎలా చేయాలంటే..
అప్పాల పాయసం తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు.
-తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక పాలిథీన్ షీట్‌పై కొద్దిగా ఆయిల్ రాసి ఒక ఉండను తీసుకొని పలుచని అప్పాల్లా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా పల్చగా ఒత్తుకుంటే బాగా వేగుతాయి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క అప్పడాన్ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
-వేయించిన అప్పాలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. మీరు రెడీమేడ్ అప్పడాలను కూడా ఉపయోగించవచ్చు.
-తర్వాత ఒక మందపాటి అడుగు కలిగిన గిన్నెను తీసుకొని అందులో పాలు పోయాలి. పాలను మీడియం మంట మీద మరిగించాలి.
-పాలు పొంగు రావడం మొదలైన తర్వాత మంటను తగ్గించి పాలను మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం చిక్కబడే వరకు మరిగించాలి.
-పాలు చిక్కబడిన తర్వాత అందులో బెల్లం తురుము లేదా చక్కెర వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. మీరు బెల్లం ఉపయోగిస్తే పాయసానికి మంచి రంగు, రుచి వస్తాయి.
-బెల్లం కరిగిపోయిన తర్వాత ముందుగా తుంచుకున్న అప్పాల ముక్కలను పాలల్లో వేసి బాగా కలపాలి. అప్పాలు మెత్తబడే వరకు సుమారు 5-7 నిమిషాలు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకుల పొడి వేసి కలపాలి. కావాలనుకుంటే కొద్దిగా పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. పచ్చ కర్పూరం వేయడం వల్ల పాయసానికి మంచి సువాసన వస్తుంది.
ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన అప్పాల పాయసం రెడీ. దీన్ని వేడిగా లేదా చల్లగా అయినా తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications