Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మన పూర్వీకులు, మన చిన్నతనంలో ఉలవలు లేకుండా వంటగదులు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. ఉలవలు మెత్తగా అయ్యేవరకు ఉడికించి ఆ నీళ్లతో చారు చేసి తాలింపు పెట్టి వేడివేడి అన్నంలోకి పోసుకుని తింటుంటే అది ఇచ్చే బలం ముందు ఎన్ని వ్యాయామాలు పాటించినా వ్యర్థమే. అంతలా మన తెలుగు సంప్రదాయ వంటకాల్లో ఉలవలు భాగమయ్యాయి. కానీ ఇప్పుడు ఉరుకులు పరుగుల జీవితంలో ఇంత శ్రమ పడి చేసి కాచే తీరిక ఎవరికీ లేదు. అందుకే ప్రత్యేకంగా రెస్టారెంట్లు సైతం పుట్టుకొచ్చాయి. అయితే ఇంట్లోనే ఆరోగ్యకరంగా వాటిని చేసుకోవాలి.. కానీ టైం లేదంటే మాత్రం ఉలవలతో ఇలా చేసుకోండి.. సాధారణ పచ్చళ్ల కంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది.

ఉలవల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ బాధితులకు, బరువు తగ్గాలనుకునేవారికి, గుండె ఆరోగ్యానికి ఉలవలు సంజీవనిలా పనిచేస్తాయి. అలాంటి ఉలవలతో ఉదయాన్నే ఇలా పచ్చడి చేసి పెట్టండి. ఇడ్లీ, దోశలాంటి టిఫిన్స్‌లోకే కాదు.. వేడివేడి అన్నంలోకి కూడా ఆవురావురుమంటూ తినేయొచ్చు.
ఉలవల చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉలవలు- అరకప్పు
నూనె- ఐదు టీస్పూన్లు
పచ్చిశనగపప్పు- టీస్పూన్
మినప్పప్పు- టీస్పూన్
ఎండుమిర్చి- 15
వెల్లుల్లి రెబ్బలు- 7
చింతపండు- కొద్దిగా
పచ్చికొబ్బరి- అర కప్పు
రాతి ఉప్పు- టీస్పూన్
ఇంగువ- పావు టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
కరివేపాకు- కొద్దిగా
ఉలవల చట్నీ తయారీ విధానం
ఉలవల చట్నీ తయారీ కోసం స్టవ్‌పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక ఉలవలను వేసి దోరగా, నోట్లో వేస్తే క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకుని చల్లారబెట్టాలి.
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ఇప్పుడు అదే పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వేసి వేగనివ్వాలి. కొద్దిగా చింతపండు వేసి కలిపాక పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేవరకు మగ్గనివ్వాలి.

టీస్పూన్ రాతి ఉప్పు, ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి ఉలవలను, ఈ మిశ్రమాన్ని తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
ఇప్పుడు చిన్న తాలింపు పాన్ తీసుకొని అందులో మిగిలిన నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని పచ్చడిలో తాలింపు పెట్టుకోవడమే.
రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉలవల చట్నీ రెడీ. ఉదయాన్నే త్వరగా అయిపోవడంతో పాటు టిఫిన్స్‌లోకి అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications