Latest Updates
-
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి -
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ
తెలుగువారికి అత్యంత ఇష్టమైన కూరగాయల్లో వంకాయది ఎప్పుడూ ఫస్ట్ ప్లేసే. వంకాయతో వేపుడు చేసినా, పులుసు చేసినా, పచ్చడి చేసినా, బజ్జీ చేసినా ఏది చేసినా అద్భుతమే. అయితే వంకాయ పచ్చడిలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి. ఒక్కసారి పచ్చవంకాయలతో నిల్వ పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ రుచి మీ చివరిదాకా నాలుక మీద ఉండిపోతుంది. అంత రుచిగా ఉంటుంది.
వేడి అన్నంలో ఈ వంకాయ నిల్వ పచ్చడి కలుపుకుని తింటుంటే కంచంలో వేరే కూరలు అక్కర్లేదు అనిపిస్తుంది. తినేకొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. 2 నెలల వరకు నిల్వ ఉండేలా వంకాయ పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

వంకాయ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆవాలు
-జీలకర్ర
-మెంతులు
-మినపప్పు
-వెల్లుల్లి
-ధనియాలు
-కరివేపాకు
-చింతపండు
-పచ్చ వంకయాలు
-నూనె
-ఎండుమిరపకాయలు
-కారం పొడి
-ఉప్పు
-పచ్చి శెనగపప్పు
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు
వంకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం
-ముందుగా పచ్చ వంకాయలు అర కేజీ తీసుకోండి. వాటని నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటని గుడ్డతో శుభ్రంగా తడిలేకుండా తుచిచి పక్కన పెట్టుకోండి. వీటిని ఇప్పుడే కట్ చేయకూడదు.
-తర్వాత పిక్కలు, తీగలు లేకుండా నిమ్మకాయంత సైజు చింతపండు గిన్నెలో వేసి వేడి నీళ్లు కొంచెం పోసి నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకోండి. అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి అవి కలర్ మారేంతవరకు తక్కువ మంట మీద వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
తర్వాత స్టవ్ మీద పాన్ లోనే 1 కప్పు పల్లీ నూనె వేసి వేడి చెయ్యాలి. ఆయిల్ ఎక్కెవ ఉంటేనే పచ్చడి నిల్వకు బాగుంటుంది. నూనె వేడెక్కేలోగా వంకాయలను కట్ చేసుకోండి. అంటే వంకాయలను ముక్కలుగా కాకుండా, ఒక్కో కాయ సైన తొక్క కూడా తీయకుండా కాయను నాలుగు భాగాలుగా గాట్లు పెట్లినట్లుగా ఉండాలి.
-తర్వాత గాట్లుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేడెక్కిన నూనెలో వేయండి. వంకాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి.
-వంకాయు లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లో మిగిలిన నూనెలో తాలింపు వేసుకోవాలి. ఇందుకోసం అందులో 1 టీస్పూన్ పచ్చిశెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ గా ఫ్రై అయ్యాక అందులో 5 ఎండుమిరపకాయల ముక్కలు, కచ్చాపచ్చాగా దంచుకున్న 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి.
-ఈలోగా నానబెట్టిన చింతపండుని చేత్తో గట్టిగా పిండి పేస్ట్ లా చేసుకోండి. లేదా మిక్సీలో అయినా వేసి పేస్ట్ లా చేసుకోండి. ఈ చింతపండు పేస్ట్ ని తాలింపులో వేసి కలిపి 1 నిమిషం పాటు తక్కువ మంట మీద వేయించాలి. దీంతో పచ్చిదనం అంతా పోతుంది.
-తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి దానిని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ముందుగా వేయించుకున్న చేసుకున్న ఆవాలు, ధనియాలు, మెంతుల మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కకు తీసుకోండి.
-తర్వాత మిక్సీజార్ లో అరకప్పు కారం పౌడర్, పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వేయండి, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి, ఇందులోనే ముందు గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు ఆ పొడిలో వేయించుకున్న వంకాయల మిశ్రమం వేసి మొత్తం వంకాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ తో సహా వేయించిన తాలింపు వేసి మొత్తం వంకాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. దీనిని గిన్నెలో వేసి మూతపెట్టుకోండి. 1 రోజు తర్వాత బాగా ఊరి భలే రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
