Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
అనపగింజల(పితికిపప్పు)కుర్మా-సంక్రాంతి స్పెషల్

అనపగింజలతో మరో రుచికరమైన వంట పితికిపప్పు కుర్మా. ఇది ఇండియన్ మసాల దినుసులతో తయారు చేస్తారు. చాలా రుచికరంగా ఉండే ఈ రిసిపి రైస్, రోటీ, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ మంచి కాంబినేషన్. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం...
అనపగింజలు: 2cups
ధనియాలు: 1 tbsp
బ్లాక్ పెప్పర్: 1/4 tbsp
ఎండుకొబ్బరిపొడి: 2 tbsp
జీలకర్ర: 1/4 tbsp
ఎండుమిర్చి: 6
అల్లం: చిన్న ముక్క
వెల్లులి రెబ్బలు: 8-10
గసగసాలు: 1 tbsp
యాలకులు: 1-2
లవంగాలు: 3 to 4
టమోటో: 2(కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2పెద్దవి(తరిగిపెట్టుకోవాలి)
చింతపండుగుజ్జు: 1tbsp
బెల్లం: చిన్న ముక్క
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు పోసి అందులో అనపగింజలను ఒక ఐదు నిముషాల పాటు వేయాలి.
2. తర్వాత వీటికి ప్లేట్లోకి వేసుకొని పైపొట్టును తీసివేయాలి. (వీటిని పితికిపప్పు అంటారు).
3. వీటిని కుక్కర్ లో పేసి ఒక విజిల్ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ధనియాలు, జీలకర్ర, బ్లాక్ పెప్పర్, గసగసాలు, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఫ్రై చేసుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు గుజ్జు, ఉల్లిపాయలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసి మరో 5నిముషాలు వేయించి అందులోనే టమోటో ముక్కలు కూడా వేసి వేయించాలి.
7. తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి, కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్నా పితికిపప్పును కూడా వేసి మసాలా మిశ్రమంతో బాగా మిక్స్ చేసి తర్వాత 5నిముషాలు మీడియం మంటమీద ఉడికించుకోవాలి. అందులోనే అవసరమైతేనే బెల్లం కొద్దిగా కలుపుకోవచ్చు. అంతే పితికిపప్పు కుర్మా రెడీ. ఇది రైస్, రోటీ, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications