Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
క్యారెట్ రైస్ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ బ్రేక్ ఫాస్ట్
క్యారెట్ రైస్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మరియు హెల్తీ మీల్. క్యారెట్ రైస్ ను రోజులో ఎప్పుడైనా తినవచ్చు . ఐతే ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో క్యారెట్ రైస్ ఉంటే కనుక శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి.ఇది చాలా సింపుల్ గా చాలా త్వరగా తయారయ్యే బ్రేక్ ఫాస్ట్ రిసిపి.రోజు ఇడ్లీ..దోస, ఉప్మా బ్రేక్ ఫాస్ట్ లతో బోర్ కొట్టినప్పుడు ఇటువంటి వెరైటీ బ్రేక్ ఫాస్ట్ లను తయారు చేసుకోవచ్చు. దాంతో కొత్త టేస్ట్..రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
క్యారెట్ రైస్ కు కొంచెం వెరైటీగా క్యాప్సికమ్, పచ్చిబఠానీ మిక్స్ చేసుకుంటే మంచి టేస్ట్ తో పాటు ఘుమఘుమలాడే సువాసనలు నోరూరించాల్సిందే..మరి ఇంకెందుకు ఆలస్యం రండీ క్యారెట్ రైస్ తయారు చేసేద్దాం..మనసారా ఆరగించేస్తాం..

కావలసినపదార్థాలు:
బియ్యం: 1cup
ఉల్లిపాయలు: రెండు
క్యారట్: 2 లేదా 3
నెయ్యి: 2tsp
దాల్చినచెక్క: చిన్న ముక్క
మినప్పప్పు: 1tsp
లవంగాలు: 2
ఆవాలు: 1tsp
శనగపప్పు: 1tsp
బఠాణి: 2tsp
టొమాటో: 1
క్యాప్సికమ్: 1
ఉప్పు: రుచికి తగినంత
చక్కెర: చిటికెడు
కొత్తిమీర: చిన్న కట్ట (సన్నగా తరగాలి)
తయారు చేయు విధానం:
1. ముందుగా అన్నం వండి వేరే పాత్రలోకి తీసి చల్లారనివ్వాలి.
2. తర్వాత క్యాప్సికమ్, క్యారట్‌ను కడిగి చిన్న ముక్కలుగా తరిగి ఉడికించాలి. వీటిని కలిపి లేదా విడిగా ఉడికించుకోవచ్చు.
3. తర్వాత బఠాణిలలో చక్కెర వేసి ఉడికించాలి (చక్కెర వేసి ఉడికిస్తే బఠాణి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది, రుచి పెరుగుతుంది. బఠాణీలకు స్వతహాగా ఉండే వెగటు వాసన పోతుంది).
4. అలాగే టొమాటోలను కూడా ముక్కలుగా తరగాలి.
5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి, అవి మగ్గిన తరువాత టొమాటో ముక్కలు వేయించాలి.
6. తర్వాత అందులోనే క్యారట్, క్యాప్సికమ్, బఠాణి వేసి రెండు నిమిషాల సేపు వేయించాలి.
7. ఇప్పుడు మంట తగ్గించి పై మిశ్రమంలో ఉప్పు వేసి కలిపిన తర్వాత అన్నం, కొత్తిమీర వేసి కలిపితే క్యారట్ రైస్ రెడీ. కారంగా తినడానికిఇష్టపడేవాళ్లు పోపులో రెండు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications