ఆలూ కిచిడి : లంచ్ బాక్స్ స్పెషల్ రిసిపి

ఇండియన్ కుషన్స్ లో అతి సులభంగా తయారుచేసే వంటకం కిచిడి. వంటచేయడానికి బద్దకించి ఉన్నప్పుడు, టేస్టీగా ఏదైనా వెంటనే తయారుచేసుకొని తినాలనుకున్నప్పుడు బియ్యం, పప్పు కుక్కర్ లో వేసి వండేసుకోచ్చు. ఇది ఒక ఆరోగ్యకరమైన హెల్తీ కుక్కింగ్ టిప్. కిచిడిని సులభంగా తయారుచేసుకోవచ్చు అనడం కంటే, జీర్ణక్రియ సమస్యలున్నవారికి చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారంగా దీన్ని పరిగణించవచ్చు. జీర్ణం తేలిక మాత్రమే కాదు, ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

కిచిడి ట్రెడిషినల్ ఇండియన్ డిష్. సాధారణంగా దీన్ని బియ్య, పప్పుతో తయారు చేస్తారు. ఇది తయారు చేయడం సులభం మాత్రేమే కాదు, ఇందులో న్యూట్రీషియన్స్ కూడా అధికమే. ఇది పెరుగు, రైతాతో సర్వ్ చేసేటటువంటి మెయిన్ డిష్. ఈ కిచిడికి బంగాళదుంప, పచ్చిబఠానీలతో తయారుచేస్తారు. కాబట్టి, మరింత టేస్ట్ గా ఉంటుంది. మద్యాహ్నాం లచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళవచ్చు. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తీసుకుంటారు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Lunch Box: Aloo Khichdi Recipe

కావల్సిన పదార్థాలు:

బియ్యం: 1cup
నూనె: 2tbsp
జీలకర్ర: 1tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
యాలకలు: 1
పచ్చిబఠానీలు: 50grms
బంగాళదుంప: 1పెద్దది(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: 2tsp
పచ్చిమిర్చి: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
నీళ్ళు: 3cups

తయారుచేయు విధానం:
1.ముందుగా బియ్యంను శుబ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, యాలకలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. ఒక నిముషం తర్వాత అందులో బియ్యం కూడా వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలు మరియు పచ్చిబఠానీ కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేగించాలి.
6. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నీళ్ళు సోసి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు మంటను మీడియంగా పెట్టి 15నిముషాలు ఉడికించుకోవాలి. కిచిడి మెత్తబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆలూ కిచిడి రెడీ. ఇది మధ్యాహ్నాం మీల్స్ కు ఫర్ఫెక్ట్ గా నప్పుతుంది.

Story first published: Wednesday, October 29, 2014, 12:04 [IST]
Desktop Bottom Promotion