Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
ఆంధ్ర స్టైల్ ఉలవచారు రుచి చూద్దామా...
చిరుధాన్యాలతో తయారు చేసే వంటలు ఎప్పుడు ప్రత్యేకమైన సైడ్ డిష్ లుగా ఇండియన్ మీల్స్ ను పూర్తి చేస్తాయి. చిరుధాన్యాలు అధిక న్యూట్రీషనల్ విలువను కలిగి ఉంటాయి. ఇటువంటి చిరుధాన్యాలను పురుషులు ప్రతి రోజూ తినడం వల్ల చాలా ఆరోగ్యకరం అని మెన్ న్యూట్రీషినిస్టులు కూడా వ్యక్తం చేశారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుతాయి. వీటిలో అధిక ప్రోటీనులతో పాటు మంచి డైయటేరియన్ ఫైబర్, మినిరల్స్, మరియు విటమిన్ బి1వంటివి పుష్కలంగా ఉంటాయి.
చిరు ధాన్యాలు (ఉలవలు) ఉపయోగించి ఫ్రై మరియు చారు, పులుసు వంటి వంటకాలను తయారు చేస్తుంటారు. చిరు ధాన్యాలు చాలా గట్టిగా ఉండటం వల్ల వీటిని రాత్రంతా నానబెట్టాల్సి వస్తుంది. ఉలవలతో తయారు చేసు పులుసు ఒక మంచి సైడ్ డిష్ గా ఉంటుంది. ప్లెయిన్ రైస్ కు అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. మరి ఉలవచారు ఎలా తయారు చేస్తారో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:
ఉలవలు: 2cup
టమోటాలు: 4
చింతపండు రసం: 2btsp
ఉల్లిపాయలు: 2
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
పచ్చిమిర్చి : 3(మద్యకు కట్ చేసుకోవాలి)
ఎండు మిర్చి: 3
అల్లంపేస్ట్: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
ధనియాలపొడి: 1tsp
కొత్తిమీర: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉలవలను ముందు రోజు నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే ఆ నీరు తీసి మళ్లీ నీళ్లుపోసి కుక్కర్‌లో ఉడికించాలి. బాగా ఉడికిన ఉలవలను మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఓ పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కట్‌చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పేస్ట్ కూడా వేసి వేగేదాకా ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అందులో టమోటాలు వేసి ఫ్రై చేయాలి. మూడు నిమిషాల తరువాత కొద్దిగా కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల ముద్దను వేసి, చింతపండు రసం పోసి మరిగించాలి. దించేముందు ధనియాలపొడి, కొత్తిమీర తరుగు వేయాలి. ఈ ఉలవచారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications