బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.!

వినాయక చవితి వచ్చిందంటే ప్రసాదాల హడావుడి మొదలవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న గణేశుడి పండుగ. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఏమేం ప్రసాదాలు చేయాలంటూ మహిళలు ఒక లిస్ట్‌, సామగ్రి రాసి పెట్టుకుంటారు. ఇక గణనాథుడికి ఇష్టమైన మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్లు ఎప్పుడూ ఉండేవే. వాటితో పాటు అటుకులతో ఇలా ప్రత్యేకంగా పంచకజ్జాయ స్వీట్‌ చేయండి. చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో అయిపోతుంది.

Vinayaka chavithi special panchakajjaya can prepare it in simple and easy process

విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు, పార్వతీపరమేశ్వరులు ముద్దుల తనయుడికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో దేశవ్యాప్తంగా గణనాథుడి మండపాలు హోరెత్తుతుంటాయి. ఇక కుడుములు, ఉండ్రాళ్లంటే ఆయనకు ఎంత ప్రీతికరమో తెలియనిది కాదు. ఇక స్వామివారికి ప్రత్యేకంగా అటుకులతో ప్రసాదాలు చేసి పెడుతుంటారు. అందులో ఒకటి పంచకజ్జాయ. గణనాథుడికి ఈ నైవేద్యం సమర్పించిన అనంతరం ప్రసాదంగా తీసుకుంటే శరీరానికీ చలువ చేస్తుంది. పంచకజ్జాయ ప్రసాదం ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్‌.!

పంచకజ్జాయ తయారీకి కావాల్సిన పదార్థాలు

తెల్ల నువ్వులు- రెండు టీస్పూన్లు
నెయ్యి- టీస్పూన్‌
జీడిపప్పు పలుకులు- 20
ఎండు ద్రాక్ష- 10
బెల్లం- 100 గ్రాములు
సన్న అటుకులు- రెండు కప్పులు
పచ్చికొబ్బరి తురుము- కప్పు
ఏలకుల పొడి- టీస్పూన్‌

పంచకజ్జాయ తయారీ విధానం

Vinayaka chavithi special panchakajjaya can prepare it in simple and easy process

పంచకజ్జాయ తయారీ కోసం ముందుగా స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని నువ్వులు వేసి దోరగా, కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేసి వేగనివ్వాలి. తర్వాత మరికాసింత నెయ్యి వేసి ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో బెల్లం వేసి కొన్ని నీళ్లు కరిగిన తర్వాత కాస్త చిక్కగా తేనె మాదిరిగా అయ్యేవరకు మరిగించుకోవాలి. తర్వాత జల్లెడ సహాయంతో వడగట్టుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..

వెడల్పాటి బౌల్‌లో పల్చటి అటుకులు వేసి అందులో నువ్వులు, జీడిపప్పు, కిస్‌మిస్‌లు ఒక్కక్కటిగా వేసుకోవాలి. పచ్చికొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి. చివరిగా బెల్లం పానకం వేసి చేత్తో మొత్తం కలగలిసేలా కలుపుకోవాలి.

బెల్లం పానకం మొత్తం అటుకులకు బాగా పట్టిన తర్వాత గణపయ్యకి నైవేద్యం సమర్పించండి. ఎంతో రుచికి, ఆరోగ్యానికి బలంగా ఉండే పంచకజ్జాయ వంటకాన్ని ఈ పండుగకు తప్పనిసరిగా ట్రై చేయండి.

ఈ స్వీట్‌లో నువ్వులు, పచ్చికొబ్బరి, బెల్లం కలపడం ద్వారా శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు ఎముకల బలానికి దోహదపడుతుంది. చిన్నారులు, వయసులో పైబడిన వారికి మరింత ఆరోగ్యకరం.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 8, 2026, 17:10 [IST]
Desktop Bottom Promotion