Latest Updates
-
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.!
కాస్త తలనొప్పి అనిపించినా, నీరసంగా, నిద్రమత్తుగా అనిపించినా వెంటనే టీ లేదా కాఫీ పెట్టుకుని తాగేస్తుంటారు. ఒక్కోసారి ఈ సమస్యలు తీవ్రమైనప్పుడు రోజుకి ఎన్ని కప్పులు తాగుతారో కూడా గుర్తుండదు. అయితే కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తప్పవు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పాయసం అప్పుడప్పుడూ చేసుకుని తాగారంటే నీరసం, తలనొప్పి తగ్గి చాలా యాక్టివ్‌గా ఉంటారు. అదే సగ్గుబియ్యం, ఫూల్ మఖానా పాయసం. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ చూద్దాం..

సగ్గుబియ్యం, ఫూల్ మఖానా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
సగ్గు బియ్యం- అర కప్పు
బెల్లం- అరకప్పు
నెయ్యి- టీస్పూన్
ఫూల్ మఖానా- కప్పు
పాలు- మూడున్నర కప్పులు
బాదం పప్పులు- 12
పిస్తా పప్పులు- 10
ఏలకులు- నాలుగు
సగ్గుబియ్యం, ఫూల్ మఖానా తయారీ విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు సార్లు కడిగి నీళ్లు పోసి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి.
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
స్టవ్‌పైన చిన్న బాణలి పెట్టుకుని బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. కరిగాక నిమిషం పాటు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి.
ఇప్పుడు కడాయి తీసుకుని స్టవ్‌పైన పెట్టుకుని నెయ్యి వేసి కరిగిన తర్వాత పూల్ మఖానా వేసి దోరగా వేయించండి. తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వండి.
అదే కడాయిలో పాలు పోసి కాగనివ్వండి. పాలు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం వేసి రెండు నిమిషాల పాటు ఉడికించండి.
ఈ లోపు మిక్సీ జార్ తీసుకుని అందులో బాదం, పిస్తాపప్పులు, ఏలకులు వేసి మెత్తగా పొడిలా చేసుకోండి.

సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు ఫూల్ మఖానా వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు పొడి మిశ్రమాన్ని వేసి మరో మూడు నిమిషాల పాటు సన్నని మంటపైన ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసి పాయసాన్ని చల్లారనివ్వండి.
పాయసం చల్లారిన తర్వాత అందులో బెల్లం పానకం వేసి కలపండి. అంతే ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం ఫూల్ మఖానా పాయసం రెడీ. ఈ రుచికరమైన పాయసాన్ని రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోండి.
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
ఫూల్ మఖానా, సగ్గుబియ్యంలోని పోషకాలు నీరసాన్ని తగ్గిస్తాయి. శరీరానికి చలువ చేస్తాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా దోహదపడతాయి. పాలలోని కాల్షియం బలంతో పాటు త్వరగా నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. రాత్రి సమయంలో తీసుకోవడం ద్వారా బాగా నిద్రపడుతుంది.
నిద్రలేమి, నీరసం, తలనొప్పి సమస్యలు ఉన్నవారు ఈ ఆరోగ్యకరమైన పాయసాన్ని తరచూ తీసుకుంటే మేలు చేస్తుంది. టీ, కాఫీలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను డైట్‌లో చేర్చుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
