Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులకు తప్పనిసరిగా ఇంట్లో ముక్క ఉండాల్సిందే. అది చికెన్, మటన్, ఫిష్ ఏదైనా కావచ్చు. ఆ ఘుమఘుమలకే కడుపు నిండిపోతుంది. చికెన్, మటన్ వండటం ఒక ఎత్తయితే చేపలు వండటం ఓ కసరత్తు లాంటిది. పులుసు, ఉప్పు, కారం అన్నీ సరిగా పడితేనే ముక్క మెత్తగా రుచిగా ఉంటుంది. అయితే చాలా మందు ముళ్లులు ఉంటాయనే భయంతో ఎక్కువగా తినరు, లేదా చాలా సేపు తింటారు. అందుకే ఎక్కువ వేపుళ్లను ఇష్టపడతారు. కానీ ఈ సారి కొత్తగా చేపల పకోడీని ట్రై చేయండి. వేపుడుతో పోలిస్తే ఫిష్ పకోడీ చేయడం చాలా సులభం.

చేపల పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ ఫిష్- కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్- నాలుగు టీస్పూన్లు
గరం మసాలా- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
మిరియాల పొడి- టీస్పూన్
రెడ్ చిల్లీ సాస్- నాలుగు టీస్పూన్లు
కారం- నాలుగు టీస్పూన్లు
పసుపు- అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
నిమ్మకాయ- ఒకటి
కార్న్‌ఫ్లోర్- ఆరు టీస్పూన్లు
బియ్యం పిండి- నాలుగు టీస్పూన్లు
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
పచ్చిమిర్చి- పది
కరివేపాకు- ఐదు రెబ్బలు
చేపల పకోడీ తయారీ విధానం
ముందుగా బోన్‌లెస్ ఫిష్ ముక్కలను ఉప్పు, నీళ్లతో శుభ్రంగా కడగాలి. నీచు వాసన లేకుండా కడిగిన తర్వాత నీళ్లన్నీ పోయే వరకు ఉంచాలి.

తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి.
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇప్పుడు కట్టెల పొయ్యి లేదా స్టవ్‌పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్లో కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసి మరోసారి కలగలపాలి. ఇప్పుడు కాగుతున్న నూనెలోంచి ఒక గరిటె నూనె చేప ముక్కల్లో పోసి మరోసారి బాగా కలపాలి. అయితే ముక్కలను గట్టిగా కాకుండా స్మూత్‌గా కలపాలి. లేదంటే చిరిగిపోతాయి.

నూనె బాగా కాగిన తర్వాత మసాలా పట్టించిన ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని క్రిస్పీగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఇలా అన్ని ముక్కలను వేయించుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి.
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకును నూనెలో వేయించి తీయాలి.
కరకరలాడే చేపల పకోడీ రెడీ. వీటిని ఉల్లిపాయ సలాడ్‌తో సర్వ్ చేసుకుని మధ్యమధ్యలో వేయించిన పచ్చిమిర్చితో ఫిష్ పకోడీని తింటే వచ్చే మజానే వేరు. ముళ్ల చేపలను తినడానికి భయపడే పిల్లలకు, పెద్దలకు ఇది బెస్ట్ అండ్ సూపర్ ఆప్షన్.. ఈ సండే తప్పనిసరిగా ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications