Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
పార్ట్‌నర్‌కు మరింత దగ్గర కావాలంటే..!
రిలేషన్‌షిప్‌లో రొమాన్స్ లేకపోతే అసలు కిక్కు మిస్ అయినట్టు. రిలేషన్‌షిప్‌లో రొమాన్స్ అంటే పాలలో టీపొడి లాంటిది. రెండూ వుంటేనే పూర్తిగా టీ తయారౌతుంది. అలాగే రిలేషన్‌షిప్‌లో రొమాన్స్ ఉంటేనే అది పూర్తవుతుంది. పార్ట్‌నర్‌తో ఎంత రొమాంటిక్‌గా ఉంటే బంధం అంత బలంగా వుంటుంది. చాలా రకాలుగా రొమాన్స్‌ని వ్యక్తపరచవచ్చు. కొన్నింటిని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.
ప్రేమను తెలియజేడం
నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో పూర్తి కాకుండా వారిని ఎందుకు ప్రేమిస్తున్నారో వారికి వివరించాలి. వారికి పదే పదే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు చెబుతండాలి. రొమాన్స్‌లో ఇది మొదటి స్టెప్ అనుకోవచ్చు.

ప్రేమ లేఖ
ఒక పెద్ద ప్రేమ లేఖ రాయండి. వారిని ఎందుకు ప్రేమిస్తున్నారో ఆ లేఖలో వివరంగా స్పష్టంగా తెలియజేయండి. అన్ని కారణాలను అందులో వివరించాలి. అవి చదివిన తరువాత చాలా భావోద్వేగానికి గురౌతారు.
ముద్దు
గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ అని ప్రతీరోజు చెబుతూ ఉండండి. కేవలం చెప్పడం కాకుండా ముద్ద పెడుతూ చెప్పడం మరింత రొమాంటిక్‌గా వుంటుంది.
మాట్లాడుకోవాలి
ఇద్దరు పార్ట్‌నర్స్ ఒకరితో ఒకరు రొమాన్స్ గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవాలి. వారికున్న కోరికలను మనసువిప్పి చెప్పాలి. అప్పుడు మాత్రమే వారు పూర్తిగా రొమాన్స్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు.
ప్రేమ భాష
ప్రేమికుల మధ్య ప్రత్యేకమైన ప్రేమ భాష అనేది ఉంటుంది. అది ఇద్దరూ అర్థం చేసుకోగలగాలి. ఒకరి ఎమోషన్స్‌ను మరొకరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ భాష ఎలాగైనా ఉండవచ్చు కానీ దాన్ని అర్ధం చేసుకున్నప్పుడే ఇద్దరి ప్రేమ బంధం బలంగా ఉంటుంది.
ప్రాధాన్యత
ఇంట్లో వేరే చిన్న పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్ట్‌నర్‌కు సమయం కేటాయించాలి. ఉదాహరణక ఇంట్లో పిల్లలతో సమయం గడిచిపోతున్నా సరే ఆ పనులను కొంత సమయం వరకు పక్కనబెట్టి రొమాన్స్‌లో ఉండాలి.
సర్‌ప్రైజెస్ ఇస్తూ ఉండండి
పార్ట్‌నర్‌కు సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఉండాలి. అది చిన్న గిఫ్ట్ అయినా కావచ్చు లేదా చిన్న కవిత, లేదా సడన్ కిస్..ఏదైనా గానీ పార్ట్‌నర్‌ని మీ ప్రేమతో సర్‌ప్రైజ్ చేస్తూ ఉండాలి. ఇది మీ పార్ట్‌నర్‌తో మరింత డీప్‌గా కనెక్ట్ అయ్యేట్టుగా చేస్తుంది.
శ్రద్ధగా వినడం
పార్ట్‌నర్ ఏమి చెబుతున్నారనేదాన్ని శ్రద్ధగా వినాలి. మీ పార్ట్‌నర్ చెప్పేవి ఎంత శ్రద్ధగా వింటే మీరు తనను అంత బాగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆలోచనలను, భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
రొమాన్స్
రొమాన్స్ మొదలయ్యేది శారీరక స్పర్షతోనే అన్న విషయాన్ని మరిచిపోవద్దు. ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, చేతులను పట్టుకోవడం ఇవన్నీ శారీరక రొమాన్స్ కిందకే వస్తాయి. బంధం సంతోషంగా ఉండాలంటే పార్ట్‌నర్‌కు శారీరకంగా దగ్గర కావడం చాలా అవసరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
వారికోసం వంట చేయడం
పార్ట్‌నర్‌కు ఇష్టమైన డిష్‌ని మీరే స్వయంగా వండి వారికి వడ్డిస్తే అప్పుడు కలిగే ప్రేమ తరువాత ఉండే రొమాన్స్ చాలా పీక్‌లో ఉంటుంది.
క్యాండిల్స్
ఉంటున్న రూం మొత్తం క్యాండిల్స్‌తో నింపేయండి. సాయంత్ర చీకటి పడగానే పార్ట్‌నర్ వచ్చినప్పుడు ఒక సర్‌ప్రైజ్ అనిపించేలా రూంలో లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి క్యాండిల్స్‌తో డెకొరేటివ్ టైప్‌లో వెలిగించి పెట్టండి. ఆ వ్యూ చూడటానికి అందంగా మాత్రమే కాదు పార్ట్‌నర్స్‌కు చాలా రొమాంటిక్‌గా ఉంటుంది.



Click it and Unblock the Notifications