Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
విధున నా దేవత, వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేసిందనుకున్నా #mystory357
నేను నా స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత దివ్య నన్ను నమ్మింది. నాకు విధున గురించి మొత్తం చెప్పింది. "నేను,విధున కాలేజీ డేస్ నుంచి స్నేహితురాళ్లం.
నెల రోజుల్లో ఆ పిల్ల ప్లాట్ అయ్యింది, గల్లీలో నేనే కింగ్ ననుకున్నాను, అలా హ్యాండ్ ఇస్తదని అనుకోలేదు #mystory356 (ఇక్కడ క్లిక్ చేసి చదవండి) ఈ స్టోరీకి కంటిన్యూ కథ ఇది.
ఫేస్ బుక్ లో విధున పెళ్లి ఫొటో చూశాక నా మదిని ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి. విధున నన్ను అంత ఈజీగా ఎలా మరిచిపోయింది. నా నుంచి తను ఎందుకలా దూరంగా వెళ్లింది. మా గళ్లీ నుంచి వెళ్లాక తను ఎక్కడుండేది.. ఇవన్నీ ఎలా అయినా సరే తెలుసుకోవాలనుకున్నాను.
ఎప్పటికైనా విధునను మళ్లీ కలుస్తాననే ఆశతో ఉన్న నాకు తన పెళ్లి వార్త గుండెల్లో బాధను నింపింది. తను నమ్మించి మోసం చేసే రకంకాదు.. తన మనస్సు నాకు తెలుసు. కానీ ఎందుకలా చేసిందో నాకు అర్థం కాలేదు.

దివ్య అనే అమ్మాయి
ఫేస్ బుక్ లో ఆ ఫొటోకు లైక్స్, కామెంట్స్ కొట్టిన ప్రతి ఒక్కరి ద్వారా విధున గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాను. చివరకు దివ్య అనే అమ్మాయి పాజిటివ్ గా స్పందించింది. మొదట దివ్య నన్ను నమ్మలేదు.

ట్యూషన్స్ చెబుతూ
నేను నా స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత దివ్య నన్ను నమ్మింది. నాకు విధున గురించి మొత్తం చెప్పింది. "నేను,విధున కాలేజీ డేస్ నుంచి స్నేహితురాళ్లం. ఇద్దరం బీఎడ్ చేశాం. తర్వాత నేను ఎంఎండ్ లో జాయినయ్యాను. తను ఒక ప్రైవేట్ స్కూల్ లో చేరి, ట్యూషన్స్ చెబుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది"

రెండో భార్యకు పుట్టిన అమ్మాయే..
విధున వాళ్ల నాన్న తాగుబోతు. మొదటి భార్య విడిచిపెట్టిపోవడంతో మరోపెళ్లి చేసుకున్నాడు. ఆయన రెండో భార్యకు పుట్టిన అమ్మాయే విధున. తన తండ్రి పెట్టే బాధల్ని విధున, వాళ్ల అమ్మ భరించలేకపోయేవారు.

ప్రతి చోటుకు వెళ్లి వేధించేవాడు
అందుకే తండ్రికి దూరంగా తన తల్లితో కలిసి ఉండాలనుకుంది విధున. కొన్నాళ్లు తన అమ్మతో కలిసి తండ్రికి దూరంగా ఉంది. కానీ వాళ్ల నాన్న వాళ్లని వదల్లేదు. విధున ఉండే ప్రతి చోటుకు వెళ్లి వేధించేవాడు.

ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే..
అందుకే విధున తరుచూ ఇళ్లు మారేది. చివరకు విధున ప్రేమించే అబ్బాయి గురించి అంటే నీ గురించే అనుకుంటాను.. తన తండ్రికి తెలిసింది. తను తెచ్చిన సంబంధాన్ని ఒకే చేయకుండా.. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కచ్చితంగా అతన్ని చంపుతానని విధునను వాళ్ల నాన్న రోజూ బెదిరించేవాడు.

భయపడింది
మొదట్లో తండ్రి మాటల్ని అంత కేర్ చేయకపోయినా.. ఒక రోజు తన తండ్రి నిన్ను చంపేందుకు కొంతమంది వ్యక్తులతో ప్లాన్ చేయడం చూసి భయపడింది. నేను నీ మాటనే వింటాను నాన్న.. నువ్వు చూసిన వాణ్నే పెళ్లి చేసుకుంటానంది. అలా విధున ఏం చెయ్యలేని పరిస్థితిని వాళ్ల నాన్న సెలెక్ట్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది.

నిజంగా తను దేవత
దివ్య ఈ స్టోరీ మొత్తం చెప్పగానే నా కళ్లలో నీళ్లు ఆగలేదు. విధున అన్ని బాధలు భరించినా ఒక్కటి కూడా నాతో చెప్పుకోలేదు. నిజంగా తను దేవత. నాకోసం తను వేరే పెళ్లి చేసుకుందే తప్ప.. తనకోసం కాదని తెలిశాక ఇలాంటి అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారా అనిపించింది. విధున ఎప్పటికీ నాకే దేవతే.



Click it and Unblock the Notifications
