Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే రోజూ ఇలా చేయండి, ఉరకలేసే ఉత్సాహం వస్తుంది
దంపతుల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది సాన్నిహిత్యం. ఎవరికి వారే యమునా తీరే అనేలా ఉండే వారి మధ్య సాన్నిహిత్యం లేదని అర్థం. అయితే సన్నిహితంగా ఉండటానికి భార్యాభర్తలిద్దరూ ఎంతో కొంత కష్టపడక తప్పదు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నం చాలా ముఖ్యం.
అయితే యోగా వల్ల కూడా దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అసలు యోగా ఎలా భార్యాభర్తల మధ్య బంధాన్ని దృఢపరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

యోగా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:
యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి రక్త ప్రసరణను మెరుగుపరచడం, నాడీ వ్యవస్థను శాంతపరచడం వరకు యోగాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
శారీరక ఆరోగ్యానికే కాకుండా యోగా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీవితాన్ని మరింత సానుకూలంగా మార్చడానికి సహాయపడుతుంది. యోగా మీ భాగస్వామితో సంబంధాన్ని, భావాలను ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం.
మైండ్‌ఫుల్‌నెస్‌ను పెంపొందిస్తుంది:
యోగా సాధన వల్ల మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండటం అలవడుతుంది. అంటే వర్తమానంలో జీవించడం అలవడుతుంది. దంపతులు ఒకరి అవసరాలు, ఆలోచనలు, భావోద్వేగాలపై పూర్తిగా శ్రద్ధ వహించడం వీలవుతుంది. ఈ మైండ్‌ఫుల్‌నెస్ లోతైన కనెక్షన్‌ను పెంపొందిస్తుంది. భాగస్వాములు ఒకరినొకరు మనస్ఫూర్తిగా అభినందిస్తారు, ప్రశంసిస్తారు.
ఒకరికొకరు అనుభవాలు పంచుకోవడం:
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి యోగా చేయడం వల్ల ఇద్దరు వారి అనుభవాలను పంచుకోవడానికి సిగ్గు పడరు. అలా వారిద్దరి మధ్య బంధం మెరుగుపడుతుంది. అలాగే కలిసి యోగా సాధన చేయడం వల్ల భాగస్వాములు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం, ప్రోత్సహించుకోవడం అలవడుతుంది. కలిసికట్టుగా, ఒక్కటిగా పనులు చేయడం నేర్చుకుంటారు. భంగిమలు, శ్వాసక్రియ, ధ్యానం వంటి వాటి వల్ల భాగస్వామిపై నమ్మకం పెరుగుతుంది. అలా ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధం బలపడుతుంది.
శారీరక సాన్నిహిత్యం పెరుగుతుంది:
యోగా భంగిమలు, యోగా సమయంలో చేసే కదలికలు ఒకరి బలం, ఫ్లెక్సిబిలిటీ, స్టామినా గురించి మరొకరికి తెలిసేలా చేస్తుంది. ఇది భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. యోగా ద్వారా శారీరక, మానసిక అవగాహన పెరుగుతుంది. మరింత సంతృప్తికరమైన సన్నిహిత జీవితానికి దోహదపడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది, ఎమోషనల్ కనెక్షన్ పెరుగుతుంది:
రోజువారీ చేసే పనుల వల్ల ఒత్తిడి, ఆందోళన కలగడం సాధారణం. ఇవి సంబంధంపై ప్రభావం చూపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి భార్యాభర్తల మధ్య ఎమోషనల్ బాండింగ్ పెరగడానికి యోగా సహాయపడుతుంది. శ్వాస ప్రక్రియలు, ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. కలిసి చేసే యోగా భంగిమల ద్వారా కనెక్షన్ మెరుగుపడుతుంది.
మైండ్‌ఫుల్‌గా ఉండటం, భాగస్వాముల అనుభవాలను తెలుసుకోవడం, శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందించడం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని యోగా సాధన పెంచుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications