For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బావ అని పిలవగానే నరనరాల్లో కరెంట్ పాస్, మేనమామ కూతురితో ముద్దుల దాకా యవ్వారం

|

మా అమ్మనాన్నలది ప్రేమ వివాహం. మా మావయ్యకు మా అమ్మ అలా పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు. అందుకే మా అమ్మనాన్నలను తన ఇంట్లోకి రావొద్దని చెప్పేశాడు. ఒకవేళ వస్తే తాను ఊరేసుకుని చనిపోతానని బెదిరించాడు.

దీంతో పెళ్లయ్యాక అమ్మనాన్న అస్సలు మా అమ్మమ్మ వాలింటికి వెళ్లలేదు. మమ్మీడ్యాడీ ఇద్దరూ డాక్టర్లే. ఎంబీబీఎస్ లో ఇద్దరూ పరిచయం అయ్యారు. అప్పుడే వారి మధ్య ప్రేమ పుట్టింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

పెద్ద డాక్టర్లు

పెద్ద డాక్టర్లు

అమ్మానాన్న ఇద్దరూ పెద్ద డాక్టర్లు గా సెటిలయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప మరో తప్పు వాళ్లు చేయలేదు. ఆర్థికంగా కూడా బాగా ఎదిగారు. పండగలొచ్చినప్పుడల్లా అమ్మకు తన పుట్టింటికి వెళ్లాలని అనిపించేది. కానీ వెళ్లే అవకాశం లేదు.

ధైర్యం చేయలేకపోయాను

ధైర్యం చేయలేకపోయాను

నాకు అమ్మమ్మతాతయ్య, మామయ్య అత్తయ్య ఎలా ఉంటారో కూడా తెలియదు. మా అమ్మ అప్పుడప్పుడు ఫొటోలు చూపించేది. ఎన్నోసార్లు వెళ్లాలని నాకూ అనిపించేది. కానీ వెళ్తే వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ధైర్యం చేయలేకపోయాను.

వెంటనే ఇంటికొచ్చేయ్

వెంటనే ఇంటికొచ్చేయ్

ఒక రోజు నేను కాలేజీలో ఉండగా అమ్మ నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఇంటికొచ్చేయ్ అంది. దీంతో ఇంటికెళ్లిపోయాను. అప్పటికే కారులో అమ్మనాన్న కూర్చొన్నారు. నన్ను బైక్ ఇంట్లో పార్క్ చేసి కారులో ఎక్కమన్నారు. ఏమైంది అమ్మా.. అని ఆందోళనగా అడిగాను.

Most Read : రోజూ నాకు తెలిసిన అమ్మాయిలందరితో శృంగారం చేస్తుంటాను, కంట్రోల్ చేసుకోలేకపోయా #mystory316

ఆనందం, బాధ

ఆనందం, బాధ

మీ అమ్మమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందంటా.. చూడడానికి వెళ్తున్నాం అని అమ్మ చెప్పింది. ఫస్ట్ టైమ్ అమ్మమ్మ ఇంట్లో వాళ్లను చూడడానికి వెళ్తున్నామనే ఆనందం, మరో వైపు అమ్మమ్మకు ఆరోగ్యం బాగలేదనే బాధ రెండూ నన్ను ఆవరించాయి.

కారులో నుంచి దిగగానే

కారులో నుంచి దిగగానే

అమ్మమ్మ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్ కు వెళ్లాం. మేము కారులో నుంచి దిగగానే అందరూ మమ్మల్నే ఆశ్చర్యంగా చూస్తున్నారు. దాదాపు ఒక ఇరవై మంది అక్కడున్నారు. వాళ్లంతా మా అమ్మ కుటుంబీకులే.

మా మామయ్యే..

మా మామయ్యే..

ఒక వ్యక్తి మాత్రం మావైపే చూడడం లేదు. ఆయనే మా మామయ్య అని నాకు అర్థమైంది. తర్వాత హాస్పిటల్ లోకి వెళ్లి అమ్మమ్మను చూశాం. అమ్మనాన్న అక్కడున్న డాక్టర్లతో మాట్లాడి పరిస్థితి కనుకున్నారు. తర్వాత మరో పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లి అమ్మమ్మకు ట్రీట్ మెంట్ చేశారు.

ఒక పిల్ల మాత్రం..

ఒక పిల్ల మాత్రం..

అమ్మమ్మ ఆరోగ్యం బాగైంది. తర్వాత అందరం కలిసి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లాం. అది నాకు ఒక కొత్త ప్రపంచంలా అనిపించింది. అక్కడ ఎవరెవరు నాకు ఏమవుతారో కూడా తెలియదు. కానీ ఒక పిల్ల మాత్రం ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆటపట్టించింది.

మొదట మాట్లాడలేదు

మొదట మాట్లాడలేదు

తను మా మామయ్య కూతురు. పేరు గౌరి. మా అమ్మనాన్న ఒక రోజు ఉండి మళ్లీ సిటీకి వెళ్లిపోయారు. నన్ను కొన్ని రోజులు అక్కడే ఉండమని చెప్పారు. మామయ్య నాతో మొదట మాట్లాడలేదు. తర్వాత తనే మాట్లాడాడు.

Most Read : నా భర్త ఎంత కోఆపరేట్ చేసినా ఏమీ చేయలేడు, రెండు నిమిషాలకే ఔట్ అయిపోతాడు #mystory315

మీ నాన్న మాదిరిగా అమ్మాయిలను పడేస్తున్నావా?

మీ నాన్న మాదిరిగా అమ్మాయిలను పడేస్తున్నావా?

ఏం చదువుతున్నావ్.. బాగా చదువుతున్నావా లేదంటే మీ నాన్న మాదిరిగా అమ్మాయిలను ప్రేమలో పడేసే పనిలో ఉన్నావా అంటూ కాస్త క్లాస్ పీకాడు. కానీ నాకు ఆయనలో అంతా ప్రేమే కనిపించింది.

ఒక్కసారి చూడు రోజూ కావాలంటావు

ఒక్కసారి చూడు రోజూ కావాలంటావు

ఇక గౌరిని చూడగానే ఇంత అందమైన అమ్మాయి ఉందా మా మామకు అనిపించింది. ఉదయం లేవగానే తను నాకు కాఫీ తీసుకొచ్చేది. ఫస్ట్ రోజు నేను కాఫీ తాగను అన్నాను. ఒక్కసారి తాగి చూడు.. రోజూ అదే కాఫీ కావాలంటావు అంది. సరే అని టేస్ట్ చేశాను. నిజంగా కాఫీ చాలా బాగుంది. సూపర్బ్ అన్నాను.

బావ అనగానే..

బావ అనగానే..

ఏంటి సూపర్బ్.. కాఫీనా నేనా అంది. హేయ్ నేను కాఫీ గురించి మాట్లాడుతున్నానన్నాను. మరి నేను ఎలా ఉన్నాను బావ అంది. బావ అనగానే నా నరనరాల్లో ఏదో తెలియని కరెంట్ పాస్ అయినట్లుంది. అలా తను నన్ను ఆటపటిస్తూ ఉండేది.

తనతో చనువు పెరిగాక

తనతో చనువు పెరిగాక

తను మేమమామ కూతురైనా నేను చిన్నప్పటి నుంచి చూడకపోవడంతో తనతో ఏం మాట్లాడాలో నాకు అర్థమయ్యేదికాదు. కానీ ఒక్కరోజులోనే తనను నేను అర్థం చేసుకోగలిగాను. తను కూడా నన్ను బాగా అర్థం చేసుకుంది. మొదట అక్కడ ఒక్కరోజు ఉండకూడదనుకున్నాను. కానీ తనతో చనువు పెరిగాక అక్కడి నుంచి రాబుద్ది కాలేదు.

Most Read : వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా? #mystory313

ముద్దుల దాకా యవ్వారం

ముద్దుల దాకా యవ్వారం

ఇద్దరి మధ్య సరసాలు పెరిగాయి. ముద్దుల దాకా వెళ్లింది మా యవ్వారం. తను నన్ను బాగా ఆటపట్టించేది. ప్రత్యేకంగా ప్రపోజింగ్స్ వంటివేమీ చెప్పుకోలేదు. కానీ ఇద్దరం ప్రేమలో మునిగితేలుతున్నామని మాత్రం అర్థమైంది.

పెళ్లితో మళ్లీ

పెళ్లితో మళ్లీ

మా అమ్మ పెళ్లితో విడిపోయిన మా రెండు కుటుంబాలు మళ్లీ మా పెళ్లితో కలవాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను. చూద్దాం ఆ దేవుడు ఎలా రాసిపెట్టాడో. ఈ విషయం మా అమ్మకు చెప్పాను. నా మేనకోడల్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలని నాకూ ఉంది. కానీ మీ మావయ్య ఏం అంటారో తెలియదు కదా అంది.

మిగతా స్టోరీ #mystory319 లో చదవండి.

English summary

that incident changed to my uncle's mind

that incident changed to my uncle's mind