Latest Updates
-
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా?
నా మరదలితో చాలా కెమిస్ట్రీ నడిచింది, అమ్మ లేచిపోవడంతో మామయ్యకు నచ్చలేదు, వేరొకరితోపెళ్లి #mystory319
చిన్నప్పుడు నాకు కూడా బావ ఉన్నాడని తెలుసు. కానీ ఎలా ఉంటాడు.. ఎక్కడుంటాడనేది తెలియదు. ఒకవేళ మా బావను కలిస్తే తను నాతో మాట్లాడుతాడో అని సందేహం. ఈ మరదలి మనస్సును అర్థం చేసుకుంటాడో లేదోనని భయం. ఎన్నోకలలు
బావ అని పిలవగానే నరనరాల్లో కరెంట్ పాస్, మేమమామ కూతురితో ముద్దుల దాకా యవ్వారం అనే నా mystory317(ఇక్కడ క్లిక్ చేయండి) చదివితే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే కథ అర్థం అవుతుంది.
ఫస్ట్ గౌరీకి నా మనస్సులో మాటను చెప్పాను. నిన్ను పెళ్లి చేసుకుంటే మళ్లీ మన రెండు ఫ్యామీలీలు కలుస్తాయన్నాను. దాంతో తను చాలా సంతోషపడింది. బావా నాకు కూడా నిన్నే పెళ్లి చేసుకోవాలనుంది. నిన్ను హాస్పిటల్ లో చూసినప్పుడే నేను నీకు పడిపోయాను.

నువ్వే గుర్తొచ్చేవాడివి
చిన్నప్పటి నుంచి నేను నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? మా ఫ్రెండ్స్ అందరికీ బావలున్నారు. వారంతా వాళ్ల బావలతో గడిపే క్షణాలను, సరదాలను నాకు చెబుతుంటే నాకు నువ్వే గుర్తొచ్చేవాడివి.

బావను కలిస్తే..
చిన్నప్పుడు నాకు కూడా బావ ఉన్నాడని తెలుసు. కానీ ఎలా ఉంటాడు.. ఎక్కడుంటాడనేది తెలియదు. ఒకవేళ మా బావను కలిస్తే తను నాతో మాట్లాడుతాడో లేదో అని సందేహం. ఈ మరదలి మనస్సును అర్థం చేసుకుంటాడో లేదోనని భయం.

ఎన్నో కలలు
ఇలా చెప్పుకుంటే పోతే నీ గురించి నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నాను బావ అంటూ నా మరదలు నాకు తన మనస్సులోని మాటలన్నీ చెప్పింది.

నుదుటిపై ముద్దు పెట్టాను
ఆ మాటలు వినగానే "నీకు తెలియకుండా నన్ను ఇష్టపడే అమ్మాయి ఈ భూమి మీద ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుందని" ఒకసారి చిలుకజోస్యం చెప్పే అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే గౌరిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాను.

చాలా కెమిస్ట్రీ నడిచింది
నేను అక్కడున్న వారం రోజుల పాటు గౌరీకి నాకు మధ్య చాలా కెమిస్ట్రీ నడిచింది. ఇద్దరం చాలా రొమాన్స్ చేసుకున్నాం. ముద్దులు పెట్టుకుంటూ లోకాన్నే మైమరిచిపోయేవాళ్లం. ఎలా అయినా సరే మామయ్యను ఒప్పించే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం.

అమ్మ లేచిపోయి
మా మామయ్య ఊరికి పెద్ద. మా అమ్మ లేచిపోయి పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనపై ఇప్పటికీ ఆ మచ్చ ఉంది. తాను చేయని తప్పుకు ఊర్లో అందరి ముందు తలవంచుకోవాల్సి వస్తుందనేది ఆయన బాధ. తన చెల్లెల్ని అదుపులో పెట్టుకోలేని వాడు ఊర్లో పంచాయితీలేమీ తెంపుతాడని అందరూ అనుకుంటారని ఆయన భయం.

గౌరీని ఇష్టపడుతున్నాను
అందుకే మా అమ్మపై ఆయనకు ఇంకా కోపం తగ్గలేదు. ఒక రోజు నేను మామయ్య దగ్గరకు వెళ్లాను. మీతో ఒక విషయం చెప్పాలన్నాను. చెప్పు అన్నాడు గంభీరంగా. నేను గౌరీని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటాను అన్నాను. వెంటనే ఆయన కళ్లు ఎరుపెక్కాయి.

గౌరీకి నిశ్చితార్థం
మామయ్య ఆవేశాన్ని నేను చూడలేకపోయాను. నన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ ఆయనపై నాపై లోలోపల ఎంత కోపంతో ఊగిపోతున్నాడో మాత్రం అర్థమైంది. తర్వాత వెంటనే అక్కడి నుంచి సిటీకి వచ్చేశాను.




Click it and Unblock the Notifications
