For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామిపై మీకు అనుమానం ఉందా? అయితే ఇవి చేయండి...

|

ప్రస్తుతం కాలం బాగా మారిపోయింది. కాలం ఎంత వేగంగా మారిందో పరిస్థితులు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో భార్యభర్తలు మరియు ప్రేమికులు ఎంత త్వరగా కలసిపోతున్నారో.. అంతే త్వరగా విడిపోతున్నారు. అయితే వివాహ బంధం అనే శాశ్వత బంధాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు.

ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ వాళ్లు బంధం.. అనుబంధం అంటే ఎన్ని రోజులు వీలైతే అన్నిరోజులు మాత్రమే కలిసి ఉండటం, కలిసి జీవనం సాగించడం అనే భ్రమలో బతికేస్తున్నారు. అదే భ్రమలో తమ కాపురాన్ని కలకాలం కాకుండా కొన్నిరోజులకే కూల్చుకుంటున్నారు. తమను వంద శాతం నమ్మిన జీవిత భాగస్వాములనే నట్టేట ముంచుతున్నారు.

తమను నమ్ముకుని ఒక జీవితం ఆధారపడి ఉంటుందనే విషయాన్నే అసలు ఆలోచించటం లేదు. ఇది కేవలం ఆకర్షణ అని కూడా గ్రహించలేకపోతున్నారు. దీని వల్ల తమ కాపురంలో కలహాలు తెచ్చుకుని తమ బంధాన్ని తామే తెంచుకుంటున్నారు. అయితే అలాంటి వారందరూ తమ బంధాన్ని శాశ్వతంగా మరింత బలంగా మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

పెళ్లైన కొత్తలో..

పెళ్లైన కొత్తలో..

పెద్దలు చేసిన పెళ్లి అయినా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా జంటలు పెళ్లి అయిన కొత్తలో బాగానే ఉంటున్నారు. అందరిలాగే అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. ఆ సమయంలో ఏవైనా గొడవలు వచ్చినా.. అవి తమ మంచికే సర్దుకుపోతున్నారు. కొన్నిసార్లు పెద్ద గొడవలు జరిగినప్పటికీ పెద్దవారు నచ్చజెప్పడంతో తిరిగి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

స్వేచ్ఛ పేరిట..

స్వేచ్ఛ పేరిట..

అయితే ప్రస్తుతం చాలా జంటలు ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ విపరీతమైన స్వేచ్ఛ కోరుకుంటూ.. తమకు ప్రైవసీ అనే పేరుతో చిన్న చిన్న విషయాలకే తమ వ్యక్తిగత జీవితాల్లోకి మూడో వ్యక్తికి లేదా ఇతర వ్యక్తులకు వారే అవకాశం కల్పిస్తున్నారు. అయితే అది కూడా ప్రారంభంలో బాగానే అనిపిస్తోంది. అయితే మెల్లమెల్లగా వారి ఇన్వాల్వ్ మెంట్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇది ఏకంగా వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

స్నేహంగా చూస్తే..

స్నేహంగా చూస్తే..

ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురుకాకుండా ఉండాలంటే, మీరు మీ దాంపత్య జీవితంలో సమస్యలు అనేవి అత్యంత సహజమని మీరు గుర్తుంచుకోవాలి. అంత మాత్రానికే వాటిని పెద్దగా ఆలోచించి తమ పార్ట్ నర్ తమకు ఎప్పటికీ సరిపోరు అన్న విధంగా ఆలోచించకండి. ఎవరైనా సరే మనకు నచ్చితే వారితో స్నేహంగా ఉంటే, వారు ఏం చేసినా నచ్చుతుంది. అయితే అకస్మాత్తుగా వారిపై ఇష్టం తగ్గితే.. వారు మన కోసం ఏమి చేసినా మనకు అంతగా నచ్చవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు మీ పార్ట్ నర్ ను స్నేహపూర్వకంగా చూస్తే వారు ఏమి చేసినా మీకు నచ్చుతుంది. మీరు ఆ కోణంలో ఆలోచించాలి.

ఒక్కొక్కరికీ ఒక్కోలా...

ఒక్కొక్కరికీ ఒక్కోలా...

మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో విధమైన ఆలోచనా విధానం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనలా ఆలోచిస్తారనుకుంటే పెద్ద పొరపాటే. కాబట్టి, మీకు ఎదుటి వారు ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నారు.. తప్పులు చేస్తున్నారనుకుంటే ఒక్కసారి వారి స్థానంలో ఉండి ఆలోచించండి. వారు ఎందుకు అలా చేశారు.. ఏం ఆలోచిస్తున్నారు.. ఒకవేళ మీకు అది తప్పు అనిపిస్తే, ఓసారి వారితో కూర్చోని ప్రశాంతంగా మట్లాడండి. వారికి ఇలాంటివి సరికాదని నచ్చజెప్పండి.

మళ్లీ చెప్పండి..

మళ్లీ చెప్పండి..

ఎందుకంటే మీ భాగస్వామితో మీరు మొహమాటం పడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎవరి దగ్గరి వారో అని బయటి వాళ్లకు మన వ్యక్తిగత విషయాలు చెప్పుకుని బాధపడకంటే, మన భాగస్వామితో అన్ని విషయాలను పంచుకోవడమే మేలు. అయితే ఒక్కసారిగా ఇది సాధ్యం కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వారికి ఒకసారి అర్థం కాకపోతే, మళ్లీ మళ్లీ చెప్పండి. దాని వల్ల ఎలాంటి నష్టం అనేదే ఉండదు. ఇలా చేయడం వల్ల వారిలో చాలా మార్పు వస్తుంది.

ఇతరులకు అవకాశమివ్వొద్దు..

ఇతరులకు అవకాశమివ్వొద్దు..

మీ జీవిత భాగస్వామి ఏమైనా తప్పులు చేస్తే వారికి నచ్చజెప్పాలి. అంతేకానీ, ఇలాంటి విషయాలను ఇతరులతో ఎప్పటికీ పంచుకోకండి. ఎందుకంటే ఇతరులలో చాలా మంది ఇలాంటి అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్లే వివాహేతర సంబంధాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అందుకే ఇలాంటి ఇతరులతో మాట్లాడకుండా మీ భాగస్వామితోనే మాట్లాడుకోండి. వారితో ఎక్కువ సమయాన్నిగడపండి.

ఇతరుల సహాయం..

ఇతరుల సహాయం..

ఇది ఇలా ఉండగా.. మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే.. మీ రిలేషన్ షిప్ లో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు, మీరు మీకు తెలియని వారితో ఇలాంటి విషయాలను పంచుకోకండి. అయితే మీ కుటుంబంలోని పెద్దల సహాయం తీసుకోండి. వారితో చెప్పించి చూడండి.. వారు ఎందుకలా తప్పులు చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

మీ సమస్యకు పరిష్కారం..

మీ సమస్యకు పరిష్కారం..

ఇలా చేస్తే మీ భాగస్వామి ఏదైనా విషయంలో నిరుత్సాహానికి గురయ్యారా? లేదా బాధపడ్డారా? అనే విషయాలను తెలుసుకోండి. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. అంతేకానీ, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బంధంలో రానివ్వకండి.

English summary

How to avoid secret affairs in relationships

Here we talking about how to avoid secret affairs in relationships. Read on
Story first published: Saturday, April 11, 2020, 17:54 [IST]