Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు!
స్వీట్ తినాలనిపిస్తోందా? కానీ చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని ఆగిపోతున్నారా? అయితే చక్కెర, పాలు కూడా లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మెత్తని రవ్వ లడ్డూలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ హెల్తీ లడ్డూను ఒక్కసారి రుచి చూశారంటే, మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనికి ఫిదా అవ్వాల్సిందే. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడిగి మరీ చేయించుకుంటారు.

రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉప్మా రవ్వ (బాంబే రవ్వ) - 1 కప్పు
పటిక బెల్లం పొడి - ముప్పావు కప్పు
నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టేబుల్ స్పూన్
జీడిపప్పులు - 10
ఎండు ద్రాక్ష - 10
బాదం పప్పులు - 10
రవ్వ లడ్డు తయారీ విధానం
-ఈ లడ్డూలు మెత్తగా రావాలంటే రవ్వను వేయించే విధానం చాలా ముఖ్యం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక ఒక కప్పు ఉప్మా రవ్వను వేసి మంటను పూర్తిగా మీడియం లేదా సిమ్ లో ఉంచి నిదానంగా వేయించాలి. పెద్ద మంట పెడితే రవ్వ మాడిపోతుంది.
-రవ్వ నుంచి కమ్మటి వాసన వస్తూ, లేత గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారే వరకు ఓపికగా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా నెమ్మదిగా వేయించడం వల్ల లడ్డూలు పచ్చి వాసన లేకుండా చాలా మృదువుగా వస్తాయి. బాగా వేగిన రవ్వను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి.
-పటిక బెల్లాన్ని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. రవ్వ వేడిగా ఉన్నప్పుడే, అందులో ఈ పటిక బెల్లం పొడిని వేసి చేతితో బాగా కలుపుకోవాలి. రవ్వ వేడికి పటిక బెల్లం కొద్దిగా కరిగి రవ్వతో చక్కగా మిక్స్ అవుతుంది. ఈ మిశ్రమం గట్టిగా అనిపిస్తే, మరో రెండు టేబుల్ స్పూన్ల వేడి నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా చేస్తే లడ్డూలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. దీన్ని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టి గోరువెచ్చగా అయ్యేలా ఆరనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ పై మళ్ళీ పాన్ పెట్టి మిగిలిన నెయ్యి వేడి చేయాలి. అందులో ముందుగా జీడిపప్పు, బాదం పలుకులు, కిస్మిస్ లు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
-ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ ను నెయ్యితో సహా రవ్వ మిశ్రమంలో వేసేయాలి. మంచి సువాసన కోసం యాలకుల పొడిని కూడా వేసి అంతా కలిసేలా మిక్స్ చేయాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మీడియం సైజులో గుండ్రని లడ్డూలుగా చుట్టుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోట్లో కరిగిపోయే మృదువైన రవ్వ లడ్డూలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications