Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
ముద్దులతో మీ భాగస్వామిని ముంచేస్తున్నారా? అయితే ఈ పొరపాట్లు చేయకండి సుమా...!
మీరు ముద్దులలో తప్పుడు ముద్దు అంటే ఏంటో తెలుసా? మీ నోటిలో నుండి ఎక్కువ లాలజలాన్ని ఉపయోగించి, మీరు మీ భాగస్వామి ముఖాన్ని తడపకుండా చూసుకోండి.
ఈ ప్రపంచంలో కిస్ తో వచ్చే కిక్కు.. శృంగారంలో వచ్చే సుఖంతో సమానం అని చెప్పొచ్చు. మన దేశంలో చాలా మంది పురుషులు మరియు స్త్రీలు కేవలం సెక్స్ చేస్తేనే తమకు ఎక్కువ సుఖం వస్తుందనే భావనలో ఉంటారు. కానీ తొలి ముద్దు కూడా అంతటి సుఖాన్ని ఇస్తుందట. తొలి ముద్దు పెడితే తెలియని గిలిగింతలా ఉండిపోవాలి. మళ్లీ మళ్లీ ముద్దు పెడితే మనసంతా పులకించిపోవాలి..

అయితే చాలా మంది మొదటి ముద్దు పెట్టేందుకు చాలా ఇబ్బంది పడుతున్నట్లు పలు సర్వేల్లో వెల్లడయ్యాయి. తొలి ముద్దు పెట్టే విషయంలో చాలా మంది భయపడుతూ ఉంటారట. అయితే ముద్దులను ఏయే స్థానాల్లో..

నాలుకతో శరీరంలోని ఏయే భాగాల్లో కవ్వించాలో తెలిసిన వారు మాత్రం ముద్దుల జడివానలో మునిగి తేలిపోతుంటారు. అయితే ముద్దులు పెట్టుకునే సమయంలో మీరు ఇలాంటి పనులను ఎప్పటికీ చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూడండి...
అలాంటి సంబంధాల కోసం అమ్మాయిలు ఎక్కువగా ఆరాటపడతారట...!

ఎక్కువగా ఆలోచించడం..
మీరు మీ భాగస్వామిని ముద్దు పెట్టుకునేందుకు ఉద్వేగభరితమైన క్షణంలో ఉన్నారు అనుకోండి. మీరు అత్యంత ఎక్కువగా ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. అయితే ముద్దు పెట్టడం గురించి నిరంతరం ఆలోచించి సమయాన్ని వృథా చేయకండి. మీకు వీలు ఉన్న చోట.. మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు ముద్దులు పెట్టుకోండి.

కళ్లు తెరిచే...
మీ భాగస్వామిని ప్రేమగా ముద్దు పెట్టుకునేటప్పుడు సిగ్గుతో కళ్లు వంటివి మూసుకోవద్దు. సినిమాల్లో చూపించినట్లు ముద్దుల సమయంలో కళ్లు మూసుకుంటే మీరు ఆ క్షణాన్ని అంతగా ఆస్వాదించలేరు. అయితే మీరు కళ్లు మూసుకోకుండా కళ్లతో కమ్యూనికేట్ వంటివి చేయొచ్చు.

లాలజలాన్ని ఉపయోగించడం..
మీరు ముద్దులలో తప్పుడు ముద్దు అంటే ఏంటో తెలుసా? మీ నోటిలో నుండి ఎక్కువ లాలజలాన్ని ఉపయోగించి, మీరు మీ భాగస్వామి ముఖాన్ని తడపకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఏమి కుక్కపిల్ల కాదు. సాధ్యమైనంత వరకు నెమ్మదిగా మరియు తక్కువ లాలాజలంతో ముద్దులు పెట్టండి...

నోటిని శుభ్రం చేసుకోండి...
మీరు మీ భాగస్వామిని ప్రేమగా ముద్దు పెట్టుకోవాలి అనుకుంటే ముందుగా మీ నోటిని శుభ్రం చేసుకోండి. మీ నోటి ద్వారా దుర్వాసన రావడం లేదని నిర్ధారించుకోండి. ఈ ముద్దు మీ ఇద్దరి జీవితంలో ఒక మంచి మలుపు అవుతుంది.

పెదాలపై దూకుడుగా వద్దు...
మీరు మీ భాగస్వామి పెదాలను ముద్దు పెట్టుకునేటప్పుడు వారి పెదాలను మెల్లగా కొరికితే పర్వాలేదు. కానీ మీరు వాటిపై దూకుడుగా దాడి చేస్తే మీ భాగస్వామికి కొంత గాయం అయ్యే అవకాశం ఉంది. రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లిప్ టు లిప్ కిస్ లీ లీనమైనప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

కెమిస్ట్రీని పెంచుకోండి...
మీరు మీ భాగస్వామిని ముద్దులతో ముగ్గులోకి దించుతున్నారంటే కెమిస్ట్రీ వర్కవుట్ చేస్తున్నారని అర్థం. ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దు పెట్టుకోవడం వంటి విషయాల్లో అస్సలు తొందరపడకండి. ఇలాంటి విషయాలను సులభంగా చేసేందుకు ప్రయత్నించండి.

మీ చేతులను కదపకండి...
మీతో పాటు మీ భాగస్వామికి కూడా ముద్దుపై ఆసక్తి మరియు ఆకర్షణ ఉందని తెలియాలంటే మీరు ముద్దు పెట్టే సమయంలో చేతులను అస్సలు కదపకండి. అంతకంటే ముందు మీ చేతులను వారి మెడకు మరియు నడుముపై ఉండేట్టు చూసుకోండి. ఆ తర్వాత స్థాయికి వారే మిమ్మల్ని తీసుకెళతారు.



Click it and Unblock the Notifications