For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి సంబంధాల కోసం అమ్మాయిలు ఎక్కువగా ఆరాటపడతారట...!

ఆన్ లైన్ మరియు మొబైల్ ఓటింగులో ప్రత్యేకత కలిగిన మార్కెటింగ్ పరిశోధన సంస్థ వన్ పోల్ ఈ సర్వేను నిర్వహించింది.

|

ఈ ప్రపంచంలో ఏ సంబంధం అయినా సక్రమంగా ఉంటే అన్నీ సాఫీగా సాగిపోతాయి. అక్రమ సంబంధాలు లేదా తప్పుడు సంబంధాలే లేని పోని ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఒకప్పుడు మన దేశంలో సంబంధం అంటే జన్మజన్మల బంధం అని అనుకునే వారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఎక్కువగా ఉండేది. ఒక పెళ్లి.. ఒక భర్త అనే ఆచారం ఆనాటి నుండి వస్తోంది. అయితే అలాంటి సంబంధాలలో కూడా కాలానికి అనుగుణంగా అనేక మార్పులు వస్తున్నాయి.

 Backup Partner In Relationship

ఈ విషయంపై ఇటీవల కొత్త పరిశోధనలు జరిగాయి. అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంబంధానికి సంబంధించి ఇటీవల ఓ సర్వే నిర్వహించగా అందులో దాదాపు 50 శాతం మంది మహిళలు తాము ఒకరితో విడిపోయిన తర్వాత కూడా వారి గురించే ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అది కూడా ప్రస్తుత భాగస్వామితో రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ తదుపరి సంబంధం కోసం బ్యాకప్ భాగస్వామిని కోరుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట. అయితే ఈ పరిశోధన పాశ్చాత్య దేశాల మహిళలకు సంబంధించి జరిగిందా? లేదా మన దేశంలో జరిగిందా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకోండి...

రోమాలు నిక్కబొడుచుకోవడం వెనుక మీకు తెలియని రహస్యాలు...రోమాలు నిక్కబొడుచుకోవడం వెనుక మీకు తెలియని రహస్యాలు...

వేలాది మంది మహిళలు..

వేలాది మంది మహిళలు..

ఆన్ లైన్ మరియు మొబైల్ ఓటింగులో ప్రత్యేకత కలిగిన మార్కెటింగ్ పరిశోధన సంస్థ వన్ పోల్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో సంబంధం విషయంలో సుమారు వెయ్యి మందికి పైగా యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) మహిళల అభిప్రాయాలను తీసుకుంది.

సగం మంది మహిళలు..

సగం మంది మహిళలు..

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో (పెళ్లి అయిన మహిళలు మరియు వివాహం కాని మహిళలు) తమ బ్యాకప్ ప్లాన్ ను, అంటే ప్రస్తుతం తమ భాగస్వామితో సంబంధంలో ఉన్నప్పటికీ మరో భాగస్వామి కోసం సిద్ధంగా ఉన్నట్లు అంగీకరించారు. ప్రస్తుత సంబంధంలో అనుకోని కారణాల వల్ల విడిపోతే వారు తమ బ్యాకప్ భాగస్వామి వద్దకు వెళ్లిపోవాలని అనుకుంటారట.

ప్లాన్ -బి

ప్లాన్ -బి

ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, ఏదైనా గొడవల వల్ల వారి రిలేషన్ షిప్ బ్రేకులు వేయాల్సిన పరిస్థితిని ఎదుర్కోవటానికి ముందే, వారి మనసులో ప్లాన్ బి సిద్ధం చేసుకుంటామని అంగీకరించారు.

వివాహిత మహిళలకే ఎక్కువ..

వివాహిత మహిళలకే ఎక్కువ..

ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వివాహం చేసుకున్న మహిళలకే ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అందులోనూ ముఖ్యంగా ఇళ్లలో నివసించే వారిలో ఈ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయట. పెళ్లి కాని మహిళలు మాత్రం ఇందుకు అంతగా ఆసక్తి చూపలేదట.

పాత స్నేహితులు..

పాత స్నేహితులు..

ఈ అధ్యయనం ప్రకారం చాలా సందర్భాలలో తమ భావాలను అర్థం చేసుకున్న.. అర్థం చేసుకునే పాత స్నేహితుడి వద్దకు బ్యాకప్ భాగస్వామిగా ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతారట. అతను మాజీ ప్రియుడు కావచ్చు లేదా మాజీ భర్త కావచ్చు లేదా పాత స్నేహితుడు కూడా కావచ్చు. లేదా ఆఫీసులో పని చేసే సహోద్యోగి కూడా అయి ఉండొచ్చు.

ఇప్పటికే బ్యాకప్ చెప్పారట..

ఇప్పటికే బ్యాకప్ చెప్పారట..

ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో కొందరు ఇప్పటికే తమ బ్యాకప్ భాగస్వామ్యంలోకి వచ్చేశారట. ఉదాహరణకు ప్రతి పది మంది మహిళల్లో నలుగురు మహిళలు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మరో పురుషుడి వైపు ఆకర్షితులు అవుతున్నారట. లేదా ప్లాన్ బి గురించి ఆలోచిస్తారట.

అక్కడ ఎక్కువ భావోద్వేగం..

అక్కడ ఎక్కువ భావోద్వేగం..

ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 12 శాతం మంది మహిళలు ప్రస్తుత భాగస్వామితో సంబంధం కంటే బ్యాకప్ భాగస్వామ్యంలో ఎక్కువ భావోద్వేగాన్ని అనుభవిస్తన్నట్లు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..

ఈ అధ్యయనంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా మంది మహిళల్లో తమ బ్యాకప్ భాగస్వామ్యం గురించి మూడో వ్యక్తికి కూడా తెలుసట. అయితే ఆ భాగస్వాములకు ‘బాకప్ ప్లాన్‘ గురించి తెలియదట. మరో 20 శాతం మంది మహిళలు తన భాగస్వామి లేదా భర్త తన జీవితంలో మరో వ్యక్తితో స్నేహం ఉన్నట్లు వెల్లడించారు.

సోషల్ మీడియా వల్లే..

సోషల్ మీడియా వల్లే..

ఈ పరిశోధన సంస్థ ప్రతినిధి ఈ ఫలితాలను వెల్లడిస్తూ దీనికి ‘చింతిస్తున్నసంకేతం‘ అని నామకరణం చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా వల్ల మహిళలు పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండేందుకు మార్గం సులభమైందని చెప్పారు.

English summary

New Study Says That 50% Women Have Backup Partner In Relationship

According to the survey, 50 per cent of women in a relationship have a plan for a back-up partner in their mind in case the current relationship doesn’t work.
Desktop Bottom Promotion