Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్‌వర్డ్‌లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
శృంగార సమయంలో కండరాలు తిమ్మిరి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి
శృంగారం ఓ మధురమైన అనుభూతి. ఇద్దరు వ్యక్తులు మానసికంగా, శారీరకంగా ఒక్కటయ్యే సమయం. లోకాన్ని మరిచి మైమరిచిపోయే ఆనందమైన సమయం. అద్భుతమైన ఆ సమయంలో ఏదైనా డిస్టర్బ్ చేస్తే కోపం, అసహనం వచ్చేస్తుంది. కొందరు శృంగారం మునిగిపోయినప్పుడు తిమ్మిరితో ఇబ్బంది పడుతుంటారు.

చాలా మందికి తిమ్మిరి అంటే అసహ్యం ఉంటుంది. శృంగార సమయంలో వస్తే మరింత చికాకుగా అనిపిస్తుంది. సాధారణంగా కాళ్ల, చేతులు, పాదాల్లో తిమ్మిరి వస్తుంది. కొన్నిసార్లు పొత్తి కడుపులో తిమ్మిరి రావొచ్చు. కొందరైతే లైంగిక చర్య సమయంలో తిమ్మిరి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. అసలు శృంగారం సమయంలో తిమ్మిరి ఎందుకు వస్తుంది, ఒకవేళ తిమ్మిరి వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగార సమయంలో కండరాల తిమ్మిరి ఎందుకు వస్తుంది?
శృంగార సమయంలో తిమ్మిరి రావడం చాలా సాధారణం. కొంత మందిలో చాలా తరచుగా తిమ్మిర్లు వస్తుంటాయి. కొన్ని సార్లు భావప్రాప్తి పొందుతున్న సమయంలో తిమ్మిరి వస్తుంది. డీహైడ్రేషన్, కండరాలు అలసిపోవడం, విపరీతంగా చెమట రావడం వల్ల శృంగార సమయంలో తిమ్మిరి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

శృంగార సమయంలో తిమ్మిరి రాకుండా ఉండాలంటే..:
1. పొజిషన్ మార్చి చూడండి
కొన్ని భంగిమల్లో శృంగారం చేసుకుంటే తిమ్మిరి అనుభవించినట్లయితే స్థానాలను మార్చుకోవడంద్వారా తిమ్మిరి నుండి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువ ఒత్తిడి లేదా బలాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేని స్థానాలను ఎంచుకోవడం ద్వారా తిమ్మిరి రాకుండా జాగ్రత్త పడొచ్చు. సౌకర్యంగా ఉండే భంగిమలు ఏంటో తెలుసుకుని వాటిని ప్రయత్నించండి.

2. ఆహారంలో మార్పులు
ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఆహారం చాలా కీలకం. పొటాషియం లోపం కండరాల దృఢత్వానికి దారితీస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, తిమ్మిరి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అరటిపండ్లు, నారింజలు, బంగాళదుంపలు, టొమాటోలు, పనీర్, పైనాపిల్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినాలి.

3. విటమిన్-ఇ
రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కండరాల తిమ్మిరి వచ్చే అవకాశాన్ని తగ్గించే పోషకం విటమిన్ ఇ. గింజలు, పండ్లు, సోయాబీన్స్, నువ్వులు, ఆలివ్ తో సహా అనేక రకాల నూనెల్లో విటమిన్-ఇ లభిస్తుంది. బ్రొకలీ, బచ్చలికూరం వంటి ఆకు కూరల్లో కూడా లభిస్తుంది.

4. విటమిన్ బి కాంప్లెక్స్
ఆహారం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నా, కొన్ని సార్లు లోపాలు మన శరీరంలోని ఏ భాగాన్ని అయినా నొప్పి లేదా స్టిఫ్‌నెస్ మొదలవుతాయి. గుడ్లు, చేపలు, ఓట్ మీల్, వేరు శెనగ, సోయాబీన్ మొదలైనవి తినడం ద్వారా శరీరానికి విటమిన్ బి కాంప్లెక్స్ అందుతుంది.

5. ఈ విషయాలు కూడా కీలకం
కండరాలను బలోపేతం చేయడానికి, లైంగిక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఈ విషయాలు కూడా చాలా కీలకం.
* ఎక్కువగా నీరు తాగాలి
* శృంగారంలో ఫోర్‌ప్లే తప్పనిసరిగా భాగం చేయాలి
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
* ధూమపానం పూర్తిగా మానేయాలి
* ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవాలి



Click it and Unblock the Notifications