Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
తోడి కోడలితో ఆత్మీయ అనుంబంధానికి ఐడియాస్
అమ్మాయిల జీవితంలో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. ప్రధానంగా ఇండియాలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అంటే.. కేవలం ఒక అబ్బాయి తన లైఫ్ లోకి వచ్చాడని కాదు.. అతని ఫ్యామిలీ మొత్తం తన జీవితంలో భాగమైనట్టు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే.. పెళ్లి తర్వాత.. భర్త కుటుంబంలో అత్తమామలు, ఆడపడుచులు, తోడి కోడళ్లతో మంచి రిలేషన్ మెయింటెయిన్ చేయాలి.
అయితే మహిళలు, కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో.. అందరితో మెలగాలి. ఎలాంటి మనస్పర్థలు లేకుండా.. మంచి సంబంధం ఏర్పరచుకోగలగాలి. అయితే.. తోడి కోడళ్లతో మెలగడం కాస్త కష్టంగా ఉంటుంది. అది కూడా ఒకే వయసు ఉన్న వాళ్లతో సర్థుకుపోవడం మరింత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తోడికోడలితో.. రిలేషన్ షిప్ హ్యాపీగా, అనుకూలంగా ఉండటానికి ఆరు అమేజింగ్ ఐడియాస్ ఉన్నాయి. వెంటనే చెక్ చేసుకుని.. అత్తగారింట్లో లైఫ్ ని బ్యూటిఫుల్ మార్చేసుకోండి.

తోడి కోడలు
పెళ్లి అనగానే భర్తతో బాంధవ్యం ఏమో గానీ.. ప్రతి అమ్మాయిని ఇరుకున పెట్టే సమస్య అత్తమామలు, ఆడపడచు, తోడికోడళ్లు. వీళ్లందరూ ఉన్న ఉమ్మడి కుటుంబం సంతోషంగానే ఉన్నా.. అనుకోకుండా వచ్చే మనస్పర్ధలు, విబేధాలు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. భర్త సోదరుడి భార్యతో రిలేషన్ బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యమైనది. తోడికోడళ్లతో అనేక సమస్యలు, మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కానీ.. ఇద్దరి మధ్య అలాంటి విబేధాలు రాకుండా.. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే.. తోడికోడలితో ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేయవచ్చు.

ఫ్రెండ్ గా
మీ తోడి కోడలు వయసుతో సంబంధం లేకుండా.. మీకంటే పెద్దది అయినా.. చిన్నది అయినా.. ఆమెతో రిలేషన్ షిప్ బాగుండాలి అంటే.. ఆమెతో ఫ్రెండ్లీగా ఉండాలి. స్నేహితురాలితో ఎలా మెలుగుతారో అలా అన్ని పీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఆమె ఫీలింగ్స్ కి అనుకూలంగా నడుచుకోవాలి. ఇలా ఉండటం వల్ల.. మీ ఇద్దరి మధ్య అనుబంధం చాలా బాగుంటుంది.

నమ్మకం
మీ తోడి కోడలిపై నమ్మకం కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. అప్పుడే మీ ఇద్దరి మధ్య అనుసంబంధం చాలా బాగుంటుంది. ఆమెకు మీపైన నమ్మకం, విశ్వాసం కలిగేలా జాగ్రత్తపడాలి. అవసరమైతే.. ఆమె తన విషయాలను నీతో కూడా పంచుకునేలా అనుబంధం ఏర్పరచుకోవాలి.

సమయం
తోడి కోడళ్ల మధ్య రిలేషన్ బలపడాలంటే.. ఆమెతో కొంత సమయం గడపడానికి కేటాయించాలి. తోడి కోడలుతో షాపింగ్, రెస్టారెంట్, సినిమాలు, ఇంకా ఏదైవా పనులు కల్పించుకుని.. ఇద్దరు బయటకు వెళ్లి.. సరదాగా ఎంజాయ్ చేయాలి.

విబేధాలు
ఇద్దరి మధ్య విబేధాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పరిష్కరించడం అవసరం. చాలా సాధారణంగా మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కానీ.. అలాంటప్పుడు ఎక్కువగా పోట్లాడకుండా.. మాట్లాడకుండా ఉండటం మంచిది. కూల్ గా ఉండాలి.

సమస్యలు
ఇద్దరి మధ్య సమస్యలు వచ్చినప్పుడు, మనస్పర్థలు కలిగినప్పుడు కాస్త ఓపికగా వ్యవహరించాలి. ఇద్దరూ కూర్చుని.. సమస్యపై మాట్లాడుకోవాలి. ఎంత వీలైత అంత మీ భర్త, అత్త ఎవరూ తలదూర్చకుండా.. జాగ్రత్త వహించాలి. ఇలా మూడో వ్యక్తి తలదూర్చితే.. సమస్య మరింత కాంప్లికేటెడ్ గా మారుతుంది. ఏ సమస్యనైనా.. ఆమెతోనే డైరెక్ట్ గా మాట్లాడటం మంచిది.

అర్థం చేసుకోవడం
మీ సమస్య గురించి మాట్లాడేటప్పుడు.. ఆమె చెప్పే విషయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆమె అంచనాలు ఎలా ఉన్నాయి.. వాటిని చేరుకోవడానికి మీరేమి చేయాలో గ్రహించాలి. ఒకవేళ ఆమె చెప్పే అంచనాలు మీరు చేరుకోలేరనిపిస్తే.. వెంటనే చెప్పేయాలి. దీనివల్ల భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు లేకుండా.. ఇద్దరి మధ్య రిలేషన్ బాగుంటుంది.



Click it and Unblock the Notifications











