Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
మీ అత్తగారి మనసు గెలుచుకునే అద్భుతమైన చిట్కాలు
భారతీయ సంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లి చేసుకోవడం అంటే.. కేవలం కోరుకున్న వ్యక్తిని సొంతం చేసుకోవడం కాదు. భర్త కుటుంబాన్నంతటినీ పెళ్లి చేసుకున్నట్లే. పెళ్లి తర్వాత జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. లైఫ్ లోకి అత్తమామలతో పాటు మరికొంతమందితో కొత్త బంధుత్వాలు, సంబంధాలు ఏర్పడుతాయి.
కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు, బాధ్యతలు మీకు కొత్త అనుభవాలను నేర్పుతాయి. కొత్త జీవితంలో అంతా కొత్త వాతవరణం, కొత్త బంధాలు, అనుబంధాలు, విభిన్న స్వభావాలు అన్నీ అలవరుచుకోవాల్సి ఉంటుంది. కూతురిగా అమ్మానాన్నల ఆపాయ్యతను ఎంజాయ్ చేసిన అమ్మాయి.. కోడలిగా అత్తమామలతో మెలగాల్సి ఉంటుంది.
READ MORE: కోడళ్ళు, అత్తగారికి చెప్పే కొన్ని తమాషా అబద్దాలు
అత్తగారి విషయానికి వస్తే.. వాళ్లు ప్రేమగానూ ఉంటారు. అలాగే పోట్లాడే వాళ్లూ ఉంటారు. ఏ పని చేసినా అత్తగా తృప్తి చెందని వాళ్లు చాలా మందే ఉంటారు. దీనివల్ల అత్తగారితో ఎప్పుడూ గొడవలు ఇండియన్ ఫ్యామిలీలో చూస్తూ ఉంటాం. అయితే కొన్ని అలవాట్లతో.. అత్తగారిని కూడా ఆకర్షించవచ్చు. అత్తయ్యను ఇంప్రెస్ చేయడానికి, వాళ్లతో రిలేషన్ హ్యాపీగా ఉండటానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం..

ఆమెతో పోటీపడకూడదు
మీ అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే ఆమెతో ఎప్పుడూ పోటీపడకూడదు. ఆమె కంటే తన కొడుకుని మీరే బాగా చూసుకుంటున్నారని ఎప్పుడూ చెప్పకూడదు. అత్తగారికి కాంప్లిమెంట్స్ ఇస్తూ.. తన వంటకాలు బాగున్నాయని పొగుడుతూ.. నచ్చినవి ఆమె దగ్గర నేర్చుకోవాలి. ఇలా చేస్తే ఆమె సంతోషపడుతుంది.. మీతో ఆప్యాయంగా మెలుగుతుంది.

అత్తగారి ముందు భర్తతో జాగ్రత్తగా వ్యవహరించాలి
అత్తగారి ముందు తన కొడుకుని బాగా చూసుకోవడం వల్ల ఆమెను ఇంప్రెస్ చేయవచ్చు. కొడుకు గురించి ఎలాంటి కంప్లైంట్ అత్తగారికి చెప్పకూడదు. వీలైతే.. ఏవైనా కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. తన కొడుకు గురించి నెగటివ్ కామెంట్స్ ఇస్తే ఏ తల్లి ఇష్టపడదు.

రెస్పెక్ట్
మీ అత్తగారితో ఎప్పుడు మాట్లాడినా.. చాలా గౌరవప్రదంగా నడుచుకోవాలి. జనరేషన్ గ్యాప్ వల్ల అత్తగారి చాదస్తం నచ్చకపోవచ్చు. కానీ.. ఇలాంటప్పుడు వాదించకుండా.. కమ్యునికేషన్ పెరిగే మార్గాలు వెతుక్కోవాలి. మీ భర్త తల్లి అని, మీ కంటే పెద్దవాళ్లు అన్న విషయం మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు ఆమెను గౌరవిస్తూ ఉండాలి.

కొంత సమయం అత్తగారితో గడపాలి
మీ అత్తగారికి కొంత సమయం కేటాయించడం చాలా అవసరం. ఆమెను భోజనానికి ఆహ్వానించడం లేదా స్పాకి తీసుకెళ్లడం చేయాలి. ఇద్దరు కలిసి బయటకి వెళ్లడం, ఆమెతో ఫంక్షన్స్ కి వెళ్లడం వల్ల తనతో రిలేషన్ పెరుగుతుంది. అంతేకాదు.. తనకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీ అత్తయ్య హ్యాపీగా ఫీలవుతారు.

అత్తగారి అభిప్రాయం తీసుకోవడం
అంతా మీ కంట్రోల్ లోనే ఉంది అనిపించినా.. కొన్ని సందర్భాల్లో ఆమె హెల్ప్ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఫర్నిచర్ మార్చాలని మీరు భావిస్తే.. ఒకసారి మీ అత్తగారి సలహా తీసుకోవడం వల్ల ఆమెను ఇంప్రెస్ చేయవచ్చు.

లేజీగా ఉండవద్దు
ఇల్లు శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు అస్సలు లేజీగా ఉండకూడదు.. చాలా యాక్టివ్ గా ఉండాలి. ఇల్లు నీట్ గా, క్లీన్ గా ఉండేలా జాగ్రత్తపడాలి. తమ కోడళ్ల నుంచి అత్తగారు ముందుగా ఎక్స్ పెక్ట్ చేసేది ఈ విషయమే. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

డ్రెస్సింగ్
మీ అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే.. డ్రెస్సింగ్ మెయింటెయిన్ చేయాలి. ట్రెడిషనల్ గా ఉంటేనే వాళ్లు ఇష్టపడతారు. కాబట్టి వాళ్ల ముందు టాటూ, హెయిర్ స్టైల్స్ వంటివి కనిపించకుండా.. ఉండేలా జాగ్రత్తపడాలి.

అప్పుడప్పుడు ఫోన్ చేయడం
మీ అత్తగారితో కమ్యునికేట్ అవుతూ ఉండాలి. అప్పుడప్పుడు కాల్ చేస్తూ.. క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి. అత్తగారే కాల్ చేయాలని వెయిట్ చేయకండి.

గిఫ్ట్స్ ఇవ్వడం
అత్తగారిని కలిసినప్పుడల్లా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల ఆమెను ఇంప్రెస్ చేయవచ్చు. ఏదైనా తనకోసం తీసుకెళ్లడం వల్ల ఆమెపై మీకున్న ప్రేమను గుర్తిస్తారు. మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది.



Click it and Unblock the Notifications