Latest Updates
-
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.!
మ్యారేజ్ లైఫ్ లో ఒత్తిడికి దూరంగా ఉండాలంటే.. ??
నేటి తరం ఒత్తిడిని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తోంది. ఉరుకుల పరుగుల జీవితం, నిద్రలేచింది మొదలు పడుకునే వరకు ఒకటే హడావుడి కారణంగా.. వైవాహిక జీవితంలో చాలా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. చాలామంది కపుల్స్ ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. స్ట్రెస్ లెవెల్స్ వెంటాడుతూనే ఉంటాయి.
లాంగ్ టర్మ్ రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి. అంతేకాదు.. చాలా విషయాలను ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఏ రిలేషన్ లోనైనా.. ఒడుదుడుకులు చాలా సహజం. కాబట్టి మీ వైవాహిక జీవితంలో ఒత్తిడిని ఫేస్ చేస్తుంటే.. మీ కోసం అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఫాలో అయిపోండి..

సెక్స్ మాత్రమే ప్రేమ కాదు
కొత్తగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన వాళ్లకు సెక్స్ పై ఎక్కువ ఎట్రాక్షన్ ఉంటుంది. ఇది రిలేషన్ లో చాలా సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. సెక్స్ లైఫ్ లో నిజాయితీ, కమ్యునికేషన్, ఓపెన్ నెస్, భయం, బాధ, నమ్మకాలు, కలలు, ఆనందం.. అన్నీ ముఖ్యమైనవి. కాబట్టి ఇద్దరూ దీనికి అంగీకరించినప్పుడు మీ రిలేషన్ లో ఒత్తిడి లేకుండా ఉంటుంది.

సెల్ఫ్ కేర్
రిలేషన్ షిప్ లో ఆనందం అనేది కేవలం ఒక్కరికి సంబంధించినది కాదు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. వ్యక్తిగతంగా కూడా ఎంజాయ్ చేయాలి. మీరు నిరుత్సాహపడితే.. మీ భాగస్వామిపై ప్రభావం చూపుతుంది. అలాగే మీరు అంగీకరించినప్పుడు మీ భాగస్వామిపై ఏదో ఒక ప్రభావం ఉంటుంది. ఏ పని చేసినా.. ఇద్దరిలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది.

ఒకరికోసం ఒకరు
ఒకవేళ మీరు మీ సంబంధాన్ని నిర్లక్ష్యం చేస్తే.. సంబంధం కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బిజీగా ఉండటం వల్ల.. భాగస్వామితో ఎంజాయ్ చేయడం, కలిసి ఉండటాన్ని మిస్ అవుతూ ఉంటారు. కానీ ఇద్దరి మధ్య దూరం పెరిగే కొద్దీ.. అఫెక్షన్ పైనా దుష్ర్పభావం పడుతుంది.

జాగ్రత్తగా వినడం
మీ భాగస్వామి చెప్పే విషయాలకు విలువనివ్వండి. మీ భాగస్వామి చెప్పే విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీ భాగస్వామి చెప్పే విధానాన్ని ముందుగా అర్థం చేసుకుని తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి.

గొడవలు
ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మిస్ అయినప్పుడే కపుల్స్ గొడవపడతారు. హ్యాపీ, హెల్తీ కపుల్స్ మళ్లీ కలవడానికి.. చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. ఇద్దరూ బాధ్యత తీసుకుని.. మళ్లీ కమ్యునికేట్ అవడానికి ప్రయత్నించినప్పుడే.. రిలేషన్ లో ఒత్తిడికి స్థానం ఉండదు.

నిజం చెప్పడం
నిజం నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అబద్ధంతో నిజాన్ని దాచిపెట్టడం వల్ల మీ మీద నమ్మకం కోల్పోతారు. కాబట్టి.. అది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా.. నిజం చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యా ఉండదు.

క్షమించమని అడగటం
ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు.. వెంటనే క్షమాపన అడగండి. సారీ అని చెప్పడం వల్ల ఇద్దరి మధ్య గొడవకు దూరంగా ఉండవచ్చు. ఏదైనా తప్పుచేసినప్పుడు సారీ చెప్పడం వల్ల.. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది.



Click it and Unblock the Notifications