Latest Updates
-
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి..
మా ఆయన ఆఫీస్ లోని అమ్మాయిలపై చూపే ప్రేమ నాపై ఒక్క శాతం కూడా చూపడు#mystory369
ఆఫీస్ లో ఏ అమ్మాయి బర్త్ డే అయినా సరే ఉదయమే లేచి మెసేజ్ పంపిస్తాడు. ఆఫీస్ లోని అమ్మాయిలపై చూపే ప్రేమ నాపై ఒక్క శాతం కూడా చూపడు. పెళ్లికి ముందు వరకు నేనంటే ఆయనకు ఒక ఏంజిల్ లాగా.
పెళ్లికి ముందు నేనంటే పడి చచ్చేవాడు, ఎంత వెంటపడ్డాడో, పెళ్లయ్యాక #mystory368 (ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
నా భర్త పెళ్లేయ్యే వరకు చాలా నిజాయితీగా ఉన్నాడు. ఓర్పుగా ఉన్నాడు. నేనంటే చచ్చేంత ప్రేమను చూపేవాడు. ఎప్పుడైతే పెళ్లయ్యిందో అప్పటి నుంచి నాపై ప్రేమ తగ్గిపోయింది.

ఏం చెప్పినా చేసేవాడు
నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు.ప్రేమించేటప్పుడు నేను ఏం చెప్పినా చేసేవాడు. ఏ రోజు ఏ విషయంలోనూ నో చెప్పలేదు. ఆయనకు నచ్చినా నచ్చకపోయినా ప్రతీది చేసేవాడు.

ఒక్క మాట కూడా అనను
ప్రేమించేటప్పుడు నేను నిన్ను ఒక్క మాట కూడా అనను అనేవాడు. పెళ్లయ్యాక రోజూ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. నోరు తెరిస్తే బూతు మాటే.

పాజిటివ్ గా తీసుకునేవాడు
ప్రేమించేటప్పుడు ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకునేవాడు. చివరకు నువ్వు నా ప్రేమను అంగీకరించకపోయినా కూడా నేను పెద్దగా బాధపడను అని పిట్ట కథలు చెప్పేవాడు.

ప్రతి విషయం నెగెటివ్ గానే
పెళ్లయ్యాక ప్రతి విషయాన్ని నెగెటివ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇద్దరమూ జాబ్స్ చేస్తున్నాం. ఫస్ట్ తారీఖు రాగానే నా సాలరీ కూడా తనే తీసుకుంటాడు. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి తనకు లెక్క చెప్పాలి.

ఒక్కనిమిషం ఉండలేను
ప్రేమించేటప్పుడు నేను లేకుంటే ఒక్కనిమిషం కూడా ఉండలేను అనేవాడు. పెళ్లయ్యాక నేను ఒక్క నిమిషం పక్కనున్న చాలు చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటాడు.

రిప్లై కూడా ఇవ్వడు
నేను ఎన్ని మెసేజ్ లు చేసినా రిప్లై కూడా ఇవ్వడు. తిన్నావా అని కూడా అడగడు. అసలు ఆయనకు నాపై ప్రేమ ఎందుకు తగ్గిందో అర్థంకాదు. అలాంటప్పుడు అన్ని మాటలు చెప్పి ఎందుకు నన్ను మ్యారేజ్ చేసుకున్నాడో నాకు అర్థం కాదు.

ఆఫీస్ నుంచి రాగానే
సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే కాసేపు ఆయనతో మాట్లాడాలని ఉంటుంది. కానీ ఏదో బిజిగా ఉన్నట్లు నటిస్తూ ఫోన్ పట్టుకుని బయటికి వెళ్లిపోతాడు. నేను కూడా ఆయన మాదిరిగానే పని చేస్తాను కానీ మరీ ఆయనలా వర్క్ ప్రెజర్ ఉన్నట్లు బిల్డప్ ఇవ్వను.

తిన్నావా అని కూడా అడగడు
ఆఫీసుకు వెళ్లాక మా ఆయన ఒక్క మెసేజ్ కూడా పంపడు. లంచ్ టైమ్ లో కనీసం తిన్నావా అని కూడా అడగడు. ఒక్కసారి కూడా కాల్ చేయడు. ప్రేమించేటప్పుడు బంగారూ అంటూ తియ్యగా పిలిచేవాడు.

బూతులే
పెళ్లయ్యాక నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నాడు. నిజంగా వివాహం ఒక ప్రాక్టికల్ రిలేషన్ అని నాకు అర్థమైంది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆ బంధాన్ని కాపాడుకోవాలి.

బిజిగా ఉన్నట్లు..
ఎప్పుడు చూసినా ఆయన బిజిగా ఉన్నట్లు ఎందుకు బిల్డప్ ఇస్తాడో అర్థం కాదు. బయట ఫ్రెండ్స్ తో అయితే గంటల తరబడి గడుపుతాడు. ఫ్రెండ్స్ లో ఎవరి బర్త్ డే ఉన్నా కూడా ఎగేసుకుని వెళ్తాడు. నా బర్త్ డే, మా పెళ్లి రోజు మా ఆయనకు అస్సలు గుర్తుండదు.

ఏ అమ్మాయి బర్త్ డే అయినా
ఆఫీస్ లో ఏ అమ్మాయి బర్త్ డే అయినా సరే ఉదయమే లేచి మెసేజ్ పంపిస్తాడు. ఆఫీస్ లోని అమ్మాయిలపై చూపే ప్రేమ నాపై ఒక్క శాతం కూడా చూపడు. పెళ్లికి ముందు వరకు నేనంటే ఆయనకు ఒక ఏంజిల్ లాగా. ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నాడో ఆ క్షణం నుంచి ఆయనకు నేను చులకన అయిపోయాను ఎందుకంటే దీన్ని నేను పెళ్లి చేసుకున్నాను.

ఏ అబ్బాయి ప్రవర్తించొద్దు
ఎలాగో ఇంట్లో పడి ఉంటుందిలే అని ఆయన భావన అని నేను అనుకుంటున్నాను. నా భర్తలాగా ఏ అబ్బాయి ప్రవర్తించొద్దని నా సలహా. ఎందుకంటే అమ్మాయికి ఒక్కసారి పెళ్లయ్యాక భర్తే సర్వసం. అన్నీ తనతోనే చెప్పుకోగలదు. అలాంటి భర్తనే పట్టించుకోకపోతే తన కష్టాలను ఎవరికి చెప్పుకుంటుంది.



Click it and Unblock the Notifications