Relationship Yoga: భార్యాభర్తలు ఇద్దరూ శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ యోగాసనాలు ప్రయత్నించండి

దంపతుల మధ్య శృంగార కాంక్షను పెంచడానికి, శృంగారాన్ని మరింతగా ఆస్వాదించడానికి, లైంగిక చర్యలో పూర్తి తృప్తి పొందడానికి యోగా చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

శృంగారం ఉత్తేజకరమైనది, చాలా మధురమైనది, ఎంతో ఉల్లాసభరితమైనది, అదో సమ్మోహనాస్త్రం, అది శారీరక మానసిక భాష. ఇద్దరు దంపతుల మధ్య శృంగారం చాలా కీలకం. బంధం బలపడాలంటే లైంగిక చర్య ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మంచి శృంగారానికి చాలా అంశాలు ప్రధాన పాత్ర పోషించాలి. ఇద్దరు దంపతులు మానసికంగా, శారీరకంగా కలవాలనుకోవాలి, కావాలనుకోవాలి.

Yoga poses to boost love making in a relationship know in Telugu

దంపతుల మధ్య శృంగార కాంక్షను పెంచడానికి, శృంగారాన్ని మరింతగా ఆస్వాదించడానికి, లైంగిక చర్యలో పూర్తి తృప్తి పొందడానికి యోగా చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని యోగసనాలు సాధన చేయడం ద్వారా లైంగిక కాంక్ష పెరుగుతుందని, పడకపై మరింత సౌకర్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

యోగా లైంగిక జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది:

యోగా లైంగిక జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది:

యోగా మీ జీవితంలో అన్ని స్థాయిల్లో సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. దంపతులు కలిసి చేసే యోగాతో ఆధ్యాత్మిక, శారీరక, లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురించబడిన 2009 అధ్యయనం ప్రకారం, యోగా ఉద్వేగం, ప్రేరేపణ మొత్తం లైంగిక సంతృప్తిని పెంచుతుంది.

పెల్విక్ ప్రాంతాని రక్త ప్రసరణను పెంచుతుంది. జననేంద్రియాల వద్ద రక్త ప్రసరణ మెరుగుపడితే అది శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. యోగా వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. పనిపై దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది.

1. వజ్రాసన

1. వజ్రాసన

  • మోకాళ్లను నెమ్మదిగా కిందకు వంచాలి.
  • మోకాళ్లను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి.
  • కుడి, ఎడమ కాళ్లను ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంచాలి.
  • అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
  • తల పైకెక్తి వెనక భాగాన్ని నిటారుగా చేయాలి.
  • 2. పశ్చిమొత్తాసన

    2. పశ్చిమొత్తాసన

    • మొదట దండాసన చేయాలి
    • మోకాళ్లతో మీ కాళ్లు కొద్దిగా వంగి ఉండేలా పెట్టాలి
    • వెన్నెముకను నిటారుగా ఉంచాలి.
    • చేతులను పైకి లేపాలి
    • పొట్ట నుండి గాలిని వదలాలి, నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి.
    • మోకాళ్లపై వంగి నిటారుగా ఉండేందుకు ప్రయత్నించాలి.
    • చేతులతో కాలి వేళ్లను పట్టుకుని అదే భంగిమలో ఉండేందుకు ప్రయత్నించాలి.
    • 3. పదహస్తాసన

      3. పదహస్తాసన

      • ముందుగా తడాసన స్థానంలో నిలబడాలి.
      • నెమ్మదిగా ముందుకు వంగాలి.
      • ముందుకు వంగుతున్నప్పుడు ఊపిరి నెమ్మదిగా తీసుకోవాలి.
      • చేతివేళ్లతో కాలి వేళ్లను తాకేందుకు ప్రయత్నించాలి.
      • ఈ ఆసనం అలవాటు ఉన్నవారు లేదా సులభంగా కాలి వేళ్లను తాకగలిగే వాళ్లు వారి అర చేతులను నేలపై ఉంచేందుకు ప్రయత్నించాలి.
      • 4. ధనురాసన

        4. ధనురాసన

        • శరీరాన్ని విల్లులా వంచే ఆసనం ఇది
        • ముందుకు బోర్లా నేలపై పడుకోవాలి.
        • తర్వాత కాళ్లను, చేతులను పైకి లేపాలి.
        • చేతులతో కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి.
        • శరీరాన్ని వెనక వైపుకు వంచడానికి ప్రయత్నించి అదే విల్లు భంగిమలో ఉండాలి.
        • 5. చక్రాసన

          5. చక్రాసన

          • ముందు నేలపై వెల్లకిలా పడుకోవాలి.
          • చేతులు, కాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని పైకి లేపాలి.
          • అర్ధచంద్రాకారంలో శరీరాన్ని వంచాలి.

Story first published: Sunday, February 26, 2023, 19:00 [IST]
Desktop Bottom Promotion