Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఏఐతో శృంగారం..పోర్న్ తరహాలో బానిసలవుతున్న భారతీయులు!..కొత్త సర్వేలో సంచలన విషయాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు కేవలం ఆఫీసు పనులు చేసిపెట్టే డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే కాదు.. ఏకంగా పడకగదిలోకి కూడా వచ్చేసింది. గ్లీడెన్-ఇప్సోస్ (Gleeden-IPSOS) సంస్థలు సంయుక్తంగా భారతదేశంలోని టైర్-1, టైర్-2 నగరాల్లో 1500 మందిపై నిర్వహించిన తాజా సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
మన దేశంలో 46 శాతం మంది ఏఐతో శృంగారభరితమైన, భావోద్వేగపూరితమైన సంభాషణలకు అచ్చం అశ్లీల చిత్రాలకి బానిసైనట్లుగానే బానిసలవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఆధునిక భారతీయ సంబంధాలలో డేటింగ్, భావోద్వేగ బంధాలు, అలాగే భాగస్వామిని మోసం చేయడం వంటి అంశాలను ఏఐ ఎలా ప్రభావితం చేస్తుందో ఈ సర్వే కళ్లకు కట్టింది.

మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తున్న ఏఐ
సర్వే రిజల్ట్ ని బట్టి చూస్తే ఏఐ ఇప్పుడు ఒక ఇంటిమసీ టూల్ (సాన్నిహిత్య సాధనం)గా మారిపోయింది. సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తమ డేటింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఏఐని వాడుతుండగా.. 60 శాతం మంది శృంగార సంబంధమైన సలహాల కోసం దీనిపై ఆధారపడుతున్నారు. మరో 64 శాతం మంది తమ రిలేషన్ షిప్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏఐ సహాయం తీసుకుంటున్నారు.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 54 శాతం మంది ఏకంగా ఒక వర్చువల్ ఏఐ పార్టనర్(కృత్రిమ భాగస్వామి)ని సృష్టించుకుని వారితో శృంగార అనుభవాలను పంచుకుంటున్నారు. 58 శాతం మంది ముద్దులు, రొమాంటిక్ మెసేజ్‌లు, తోడు కోసం ఏఐని వాడుతున్నారు. దీన్నిబట్టి ఏఐ అనేది తెర వెనుక ఉండే టెక్నాలజీ స్థాయి నుంచి, మనుషుల భావోద్వేగ,లైంగిక జీవితాల్లో ఒక క్రియాశీలక భాగస్వామిగా మారిపోయిందని స్పష్టమవుతోంది.
నైతికతకు, టెక్నాలజీకి మధ్య సంఘర్షణ
49 శాతం మంది తమ నిజ జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం కంటే ఏఐతో వర్చువల్ రొమాన్స్ చేయడానికే కనీసం ఒక్కసారైనా ప్రాధాన్యత ఇచ్చామని అంగీకరించారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన మానసిక సంఘర్షణ బయటపడింది. ఏఐతో ఇలాంటి శృంగార సంభాషణలు చేయడం కచ్చితంగా చీటింగ్ కిందకే వస్తుందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఒకవేళ తమ పార్టనర్ ఏఐతో ఇలాంటి ఎరోటిక్ (శృంగార) చాటింగ్ చేశారని తెలిస్తే తాము జీర్ణించుకోలేమని 70 శాతం మంది చెప్పారు. అలాగే తమ ఏఐ చాట్ హిస్టరీని బయటివారికి చూపించడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు.
ముంచుకొస్తున్న డీప్ ఫేక్ ముప్పు
కేవలం చాటింగ్ కే పరిమితం కాకుండా 49 శాతం మంది సెలబ్రిటీలు లేదా తమకు తెలిసిన వ్యక్తుల ముఖాలతో ఏఐ ద్వారా డీప్ ఫేక్ చిత్రాలను సృష్టించినట్లు ఒప్పుకున్నారు.
ఏఐతో వ్యక్తిగత సంభాషణలు సీక్రెట్ గా ఉన్నప్పటికీ ఇలా ఇతరుల అనుమతి లేకుండా డీప్ ఫేక్ చిత్రాలు సృష్టించడం అనేది చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిబంధనల కంటే టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతోందో ఇది నిరూపిస్తోంది



Click it and Unblock the Notifications