Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Relationship Facts : సక్సస్‌ఫుల్ రిలేషన్‌షిప్‌లో వుండే పచ్చి నిజాలు..!
రిలేషన్‌షిప్ అనేది జీవితంలో ముఖ్యమైన అంశం. ఇందులోకి దిగగానే ఎన్నో ఆటంకాలను వారు ఎదుర్కోవలసి వుంటుంది. ప్రతీ రోజు వడ్డించిన విస్తరి కాదు. ఎప్పటికప్పుడు రిలేషన్‌షిప్‌ను మెరుగుపరచుకోవడానికి ఇబ్బందులను అధిగమించడానికి కష్టపడుతూనే ఉండాలి. రిలేషన్‌షిప్‌కు సంబంధించిన కొన్ని పచ్చి నిజాలను మీతో పంచుకోబోతున్నాం.
విజయవంతమైన రిలేషన్‌షిప్‌లో ఇలాంటి పచ్చి నిజాలు వుంటాయ్ :
సక్సస్‌ఫుల్ రిలేషన్‌షిప్‌లో ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారికి సంతోషం లభిస్తుంది. కొందరు వస్తువుల్లో కూడా ఇది నాది, అది నీది అని భార్య భర్తలే అనుకుంటూ వుంటారు. నిజమైన ప్రేమలో ఇలాంటి బేధాలు, అభిప్రాయాలు వుండవు. అన్నింటినీ ఇద్దరూ షేర్ చేసుకుంటారు.
ఒకరికిపై ఒకరికి బలమైన నమ్మకం ఉంటుంది. వారి మాటల్లో చేతల్లో ఎలాంటి దాపరికాలూ వుండవు.
పార్ట్‌నర్ బాధలను అర్థం చేసుకోగలుగుతారు. వారి ఆలోచనలకు, ఎమోషన్స్‌కు విలువనిస్తారు. శారీరక ఆరోగ్యమే కాదు, మానసికంగా కూడా పార్ట్‌నర్ ఆరోగ్యంగా వున్నారా చూసుకుంటారు. దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం సహకరించనప్పుడు అన్ని రకాలుగా సహాయకారంగా వుంటారు.

బంధంలో కూడా కొన్ని హద్దులను వారు ఏర్పరుచుకుంటారు. ఈ హద్దులు కూడా వారు సంతోషంగా వుండడానికి మాత్రమే ఏర్పరుచుకుంటారు.
శారీరకంగా ఇద్దరూ చాలా దగ్గరౌతారు. హగ్ చేసుకోవడం, కిస్, శృంగారం, ఇవన్నీ వారి మధ్య తరచూ జరుగుతుంటాయ్
ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి సమయాన్ని కేటాయించుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా సమయం కేటాయించుకొని కలిసి సంతోషంగా వుంటారు. రోజూ కలిసే ఉన్నప్పటికీ ఫోన్‌లో మాట్లాడ్డానికి, చాట్ చేయడానికి చిరాకు పడకుండా కమ్యునికేషన్‌లో వుంటారు.
వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. ఎటువంటి దాపరికాలు లేకుండా, తమకు తెలిసిన రహస్యాలను అన్నింటినీ వారికి చెబుతుంటారు.
రిలేషన్‌షిప్‌లో ఎలాంటి గొడవలు వచ్చినా ఇద్దరూ తగ్గి క్షమాపణలు చెప్పుకుంటారు. సమస్యను పెద్దది కానివ్వకుండా పరిష్కరించుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య ఘర్షణలు రావడానికి మూడవ వ్యక్తి ఎక్కువగా కారణమవుతారు. ఇలాంటి మూడవ వ్యక్తులు ఎంత మంది వచ్చినా ఇద్దరూ కలిసి తమ రిలేషన్‌షిప్‌లో సంతోషంగా ముందుకు వెళ్తుంటారు.
ఒకరి భావోద్వేగాలను మరొకరు సులువుగా అర్ధం చేసుకుంటారు. వారి ఎమోషన్స్‌కు గౌరవం ఇస్తారు. ఇద్దరి మనసులూ ఒక్కటైనప్పుడు వారి ఆ ఆలోచనలు కూడా దాదాపు ఒక్కటే అవుతాయ్. పార్ట్‌నర్ కొంచెం బాధపడ్డా తెలిసిపోతుంది. సంతోషంగా ఉన్నా గుర్తుపట్టేస్తారు. ఇలా భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు.
ఇద్దరి మద్యా ప్రత్యేకమైన భాష వుంటుంది. అది వారిద్దరికి మాత్రమే తెలుస్తుంది. దాన్నే ప్రేమ భాషంటారు. నిజమైన ప్రేమికులకు ఈ ప్రేమ భాష ఖచ్చితంగా వుంటుంది.
ఎక్కవ సంతోషాన్ని కలిగించే ఆక్సిటోసిన్, డొపమైన్, కార్టిసోల్ లాంటి హారోన్లు ఇద్దరిలో బాగా ఉత్పత్తి అవుతాయ్. ఇది వారు సంతోషంగా ఉంటున్నారని తెలిపే సంకేతాలుగా చెప్పుకోవచచు.
ఎన్నేళ్లైనా వారి బంధం అలాగే వుంటుంది. ఎన్ని గొడవలు వచ్చినా వాటిని సర్దుకొని ముందుకు పోతుంటారు. రిలేషన్‌షిప్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటారు. గొడవలు రాకుండా ఇద్దరూ కలిసి జాగ్రత్త పడతారు.
ప్రేమికులు లేదా భార్యా భర్తలు తమ బంధంలో విజయవంతంగా సాగాలంటే వారి రిలేషన్‌షిప్‌లో పైన వున్న లక్షణాలు ఖచ్చితంగా వుండాలని సైకాలజీ చెబుతోంది.



Click it and Unblock the Notifications